రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. తాజాగా తెలుగు తెరపైకి ఓ ఆసక్తిరమైన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఛార్మితో మంత్ర
, అనుపమా పరమేశ్వరన్‌తో బట్టర్ ఫ్లై
వంటి కంటెంట్ ఓరియెంటెడ్ వంటి సినిమాలను తీసిన జెన్ నెక్ట్స్ ప్రొడక్షన్.. తాజాగా ఏ స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్
సినిమాని రూపొందించి విడుదల చేసింది. రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూలో చదవేద్దామా…
కథ:
ఇన్సూరెన్స్ ఏజెంట్ రవి(నిహాల్ కోదాటి) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాడు. చరిత్ర(దృశిక చందర్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ పీక్స్ లో ఉండగా ఒకరోజు ఆమె మిస్ అవుతుంది. తల్లి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుని క్రైమ్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ఆమెను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. చరిత్ర మిస్సింగ్‌కి సంబంధించి క్లూస్ రాబట్టే క్రమంలో ఆమెతో టచ్‌లో ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులు రవి స్నేహితుడు, ఒక బిగ్ షాట్ హెడ్ విక్రమ్(సమర్థ్ యుగ్)ని మొదటగా విచారించినా ఏమీ తేలక పోవడంతో చరిత్రతో క్లోజ్‌గా ఉన్న రవిని విచారించగా, తమ మధ్య ఉన్న లవ్ స్టోరీ బయటకు వస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన అరవింద్(భార్గవ) కేసును సీరియస్గా తీసుకుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఊహించని ట్విస్టులు బయటపడతాయి. ఇందులో చరిత్ర ఏమైందో పోలీసులు తెలుసుకున్నారా? చరిత్ర అదృశ్యం కావడం వెనుక విక్రం ఉన్నాడా లేక రవి ఉన్నాడా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః
ఈ సినిమాను జరిగిన సంఘటన ఆధానంగా రూపొందించిందని యూనిట్ తెలిపింది. ఈ సినిమా మిస్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో బ్లాక్ మెయిలింగ్ మాఫియాని బయటపెడుతుంది. కార్పొరేట్ స్టయిల్‌లో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారు? దాని వెనక ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందించిన ఈ సినిమాలో డైరెక్టర్ దర్శకుడు రవి ప్రకాష్ సినిమా టేకింగ్ విషయంలోనూ పర్‌ఫెక్టు అనిపించుకున్నాడు. డైరెక్టర్ శ్రమ కనిపిస్తుంది. సినిమాను ఎంగేజింగ్‌గా తీసుకెళ్లే ప్రయత్నం విజయవంతమైందనే చెప్పాలి. సినిమాలో అన్ని అంశాలు జోడించారు. సస్పెన్స్ ని నెమ్మదిగా పెంచుతూ వెళ్లాడు. మధ్య మధ్యలో థ్రిల్లింగ్ పాయింట్‌లను లీక్ చేస్తూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాడు. చరిత్ర మిస్సింగ్‌కి కారణం రవినా, విక్రమా? అనేది ఊహించే సీన్లలో ఆడియెన్స్ ఆలోచనలతో ఓ గేమ్ ఆడుకున్నాడు. రకరకాల ట్విస్టులతో ముందుకు సినిమాను కొనసాగించాడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా వెళ్లినా కూడా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లాడు. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ పెట్టి మరింత హైప్ పెంచాడు. కానీ సెకండాఫ్‌లో ఒక్కో అంశం రివీల్ చేస్తూ వచ్చాడు. మాములుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టాలి. కానీ ఇందులో డైరెక్టర్ కాస్త కూల్‌గా తీసుకెళ్లాడని చెప్పాలి. రేసి సీన్లకి ప్రయారిటీ ఇవ్వాల్సింది.
నటీనటులు:
రవి పాత్రలో నిహాల్ కోదాటి బాగా సూటయ్యాడు. పేద అబ్బాయిలా పాత్రకి పర్‌ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఇన్నోసెంట్‌గా, కొన్ని సీన్లలో కన్నింగ్‌గా చాలా బాగా చేశాడు. మరోవైపు చరిత్రగా దృషికా చందర్ గ్లామర్ సినిమాకి మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. రొమాంటిక్ సీన్లలో బాగా చేసింది. ఆడియెన్స్ ని తనతో కనెక్ట్ చేసుకుంది. నిహాల్-దృషికా జంట సినిమాని తన భుజాలపై మోశారని చెప్పొచ్చు. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా భార్గవ పోలుదాసు బాగా చేశా.రు జర్నలిస్ట్ వైజయంతిగా దేవి నాగవల్లి ఉన్నంతలో మెప్పించింది. విక్రమ్ పాత్రలో సమర్థ్ యుగ్ స్టయిలీష్‌గా ఆకట్టుకున్నాడు. మధునందన్ మరో మెప్పించే పాత్ర అవుతుంది.
టెక్నీషియన్లుః
సినిమా నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. చిన్న సినిమా అయినా మంచి క్వాలిటీతో తెరకెక్కించారు. ఆ విషయంలో జెన్ నెక్ట్స్ ప్రొడక్షన్‌ని అభినందించాలి. గిడియన్ కట్టా మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. ఐతే బీజీఎం డోస్ కాస్త తగ్గించాల్సింది. రేసిగా నడిపించేలా చేస్తే ఇంకా బాగుండేది. అమర్ దీప్ గుత్తుల కెమెరా వర్క్ బాగుంది. సినిమాకి కెమెరా వర్క్ ఓ అసెట్. ప్రవీణ పూడి ఎడిటింగ్ కి కొంత పనిచెప్పాల్సిందే. చాలా చోట్ల అనవసర సీన్లు కనిపించాయి. కాస్త కట్ చేసినా బాగుండేది. ఇక ఫైనల్‌గా దర్శకుడు రవి ప్రకాష్ దర్శకుడిగా చాలా బాగా చేశాడు. సినిమాని బాగా తెరకెక్కించారు. నెరేషన్ పరంగా కాస్త స్పీడ్ పెంచితే బాగుండేది, సీన్లు, డైలాగ్‌లు యాప్ట్ గా స్టోరీని ముందుకి తీసుకెళ్లేలా ఉన్నాయి.
విశ్లేషణ:
ప్రారంభంలోనే చరిత్ర మిస్సయినట్లుగా చూపించి అసలు ఆమె ఎవరు? ఆమె ఎందుకు మిస్ అయిందనే విషయాలు రివీల్ చేస్తూ సినిమాలోకి నెమ్మదిగా తీసుకువెళ్లాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం కోసమే వాడేసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ట్విస్టుతో కిక్కు ఇచ్చాడు. తర్వాత సెకండ్ హాఫ్ లో పూర్తిస్థాయిలో కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన దర్శకుడు అసలు చరిత్రకు ఏం జరిగింది? చరిత్ర లాంటి మరికొంతమంది అమ్మాయిలు మాయం కావడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తాడు. అయితే, ఇన్వెస్టిగేషన్‌లో కొన్నిసీన్లు అనవసరం అనిపిస్తాయి. సినిమా క్వాలిటీగా ఉంది. నటీనటులుగానీ, టెక్నీషియన్లుగానీ, బాగా చేశారు. దర్శకుడు సినిమాని నీట్‌గా తీశాడు. స్లో నెరేషన్ పక్కన పెడితే తను స్టోరీకి జస్టిఫై చేశాడు. అనుకున్న సబ్జెక్టును సూటిగా తెరమీద చూపించాడు. చిన్న చిన్న మైనస్‌లు పక్కనపెడితే కొత్తగా సాగే మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు.
రేటింగ్ 3.25 / 5