కోదాడ / హైదరాబాద్: తెలంగాణ ముఖద్వారంగా ఉన్న కోదాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలైపోయింది. ఈ నియోజకవర్గంలో ఈ సారి సీన్ రసవత్తరంగా కనిపిస్తోంది. 1962 లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొత్తం మూడు సార్లు జనతాపార్టీ విజయం సాధించగా, ఒక్క సారి ఇండిపెండెంట్, 5 సార్లు టీడీపీ, 3సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఈ సారి ఎన్నికల్లో కోదాడ గడ్డ ఎవరికి అడ్డా అవుతుందో అర్థం కాని పరిస్థితి.
తాజా పరిస్థితి చూస్తే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్దులు కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. స్వతంత్ర అభ్యర్దిగా ఉన్న అంజి యాదవ్ ప్రతి గ్రామానికి పాదయాత్ర మొదలుపెట్టేశారు. BSP అభ్యర్ది పిల్లుట్ల శ్రీనివాస్ సమస్యల మీద గళమెత్తుతున్నారు. జనసేన అభ్యర్ది మేకల సతీష్ ఫోన్ కాల్స్ ప్రచారం షురూ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ది పద్మావతి, పందిరి నాగిరెడ్డి ఇరువురు తమ మీటింగ్ లతో బిజీగా మారారు. AAP విద్యావంతులతో సమావేశాలతో కోదాడ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు.
అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న BJP, BRS లు వర్గపోరుతో ఇబ్బంది పడుతున్నాయి. BRS నుండి సిట్టింగ్ MLA మల్లయ్య యాదవ్, K. శశిధర్ రెడ్డి, NRI జలగం సుధీర్ ప్రధానంగా పోటీపడుతున్నారు. అంతేకాదు 82 ఏళ్ల వయసులో మాజీ MLA వేనెపల్లి చందర్ రావు కూడా తాను కూడా టికెట్ రేసులో ఉన్నానంటూ క్యాడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇక BC కార్డ్ నినాదంతో బీసీ మహిళలుగా వనపర్తి శిరీషా, జలగం సుష్మాలు తమ అభ్యర్దిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానికి విజ్ఞప్తులు చేశారని తెలుస్తుంది. సిట్టింగ్ కే సీట్ అని MLA మల్లయ్య యాదవ్ చెపుతుండగా, KTR ఆశీస్సులతో మీ ముందుకు అంటూ NRI జలగం సుధీర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధిష్టానం నిర్ణయం రాకముందే ప్రజల్లోకి వెళ్లేందుకు వీరందరు సిద్దపడుతున్నారు.
బీజేపీలో ఎవరికివారే యమునా తీరే అన్నట్టు సీనియర్లు, జూనియర్లు, ప్రవాస భారతీయుల వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గ్రూప్‌లను ఒకే వేదిక మీదకు తెచ్చెందుకు కిషన్ రెడ్డి వ్యూహ రచన చేస్తూ కోదాడ కే చెందిన ఒక ప్రముఖ NRI నాయకుడి కి టికెట్ ఖరారు చేయబొతున్నట్టు సమాచారం. కోదాడ నియోజక వర్గంలో ఈ సారి విద్యావంతులు ఎటువైపు మొగ్గు చూపుతే అటువైపు విజయావకాశాలు ఉంటాయి.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I