• చిత్రం: పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్

ల‌వ్‌లో కొత్త కోణాన్ని చూపిస్తూ, స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తే ఈ త‌రం ప్రేక్ష‌కులు థియేట‌ర్‌ల‌కు ప‌రుగులు పెడ‌తారు. సినిమా సూప‌ర్ హిట్ చేస్తారు. స‌రిగ్గా అలాంటి కాన్సెఫ్టుతో యూత్‌ను ఆక‌ట్టుకునే స‌బ్జెక్టుతో వ‌చ్చిన చిత్రం “పాగల్ వర్సెస్ కాదల్”. “దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి సినిమాల‌తో యూత్‌ను ఆక‌ట్టుకున్న‌ యంగ్ హీరో విజయ్ శంకర్ హీరోగా నటించిన “పాగల్ వర్సెస్ కాదల్” శుక్ర‌వారం (ఆగ‌స్టు 9న‌) విడుద‌లైంది. విజయ్ శంకర్‌కు జంట‌గా విషిక న‌టించింది. శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ చిత్రాన్ని రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహించారు. ఇంత‌కీ ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా? లేదా? ఇవాల్టీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కార్తీక్ (విజయ్ శంకర్) అనే యువ‌కుడు ప్రియ (విషిక)ని చూసి ప్రేమిస్తాడు. సైకోలా, గ‌య్యాలిలా బిహేవ్ చేస్తుంటుంది. కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు ర‌క‌ర‌కాల‌ టెస్టులు చేస్తుంటుంది. ప్రియ చేసే ఆరాచ‌క‌ల‌న్నీ భరిస్తూ ఆమెనే ప్రేమిస్తాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్, అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ ఒప్పుకోడు ఎందుకంటే అతనిది కూడా ఒక సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలయ్యే మనోజ్. అమాయ‌కుడైన‌ కార్తీక్, అతని సోదరి అమృత, సైకో మైండ్ సెట్ ఉన్న ప్రియ, మనోజ్ ప్రేమ‌లో ఒక్క‌ట‌య్యారా? ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌నేది తెలుసుకోవాలంటే థియేట‌ర్‌లో సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
అమాయ‌కుడైన యువ‌కుడు కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ యాక్టింగ్ సినిమాకే హైలైట్. ల‌వ‌ర్ ఎన్ని బాధలు పెట్టినా ప్రేమతో భరించే ఓ అమాయ‌కుడి పాత్ర చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ప్రియ పాత్రలో విషిక సైకోయిజం చేసిన తీరు మాములుగా లేదు. గ‌ర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా నటించింది. ఆమె యాక్టింగ్ చేస్తుందా లేక రియల్‌గానే అలా ఉందా అనుకుంటాం. ఇక అమృతగా అనూహ్య సారిపల్లి యాక్టింగ్ కూడా సూప‌ర్. శాడిస్ట్ సైకియాట్రిస్టుగా మనోజ్ పాత్రలో ప్రశాంత్ మెప్పించాడు. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ త‌న పాత్ర‌లో చేసిన ఎంట‌ర్‌టైన్మెంట్ అల‌రిస్తుంది. మిగ‌తా న‌టులు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతిక నిపుణులు:
టెక్నిక‌ల్‌గా ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ప్రవీణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్. బీజీఎం కూడా అదిరిపోయింది. డైరెక్ట‌ర్ రాజేశ్ ముదునూరి అన్ని టెక్నిక‌ల్ విభాగాల‌ను స‌మ‌ర్థంవంతంగా ఉప‌యోగించుకున్నాడు. క‌థ స‌రిగ్గా అర్థ‌మ‌య్యేందుకు నవధీర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగా స‌హ‌య‌ప‌డుతుంది. శ్యామ్ కుమార్ ఎడిటింగ్, ప్రవీణ్ సంగడాల మ్యూజిక్ ఆకర్షణ అవుతాయి. కథకు తగినట్లు శివత్రీ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి. సినిమా క్వాలిటీ కోసం నిర్మాత‌లు ఎక్క‌డ త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది.

విశ్లేషణ:
బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ సినిమాకు కీల‌కం. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రహ్మాజీ, షకలక శంకర్ పాత్రలు మూవీలో కొనసాగుతాయి. ప్రేమ కథల్లో స‌రికొత్త కోణం ఈ సినిమా. ఈ త‌రం ప్రేమికుల‌కు కొత్త‌గా అనిపించేలా తీయ‌డంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అది ఉంటే జీవితం నరకమే అనే పాయింట్ ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్కుతుంది. ల‌వ్, మెసెస్, ఎంట‌ర్‌టైన్మెంట్‌, మ్యూజిక్.. ఇలా అన్ని క‌ల‌గ‌లిపిన “పాగల్ వర్సెస్ కాదల్” మూవీ ల‌వ‌ర్స్‌కు ఎంతగానో న‌చ్చుతుంది.

  • రేటింగ్: 3.5 / 5

 

 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *