హైదరాబాద్: ఈ జనరేషన్ మ్యారేజ్ లైఫ్‌లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తోంది. వారి కోరికలకు, అభిరుచిలకు తగిన విధంగా వివాహా వస్త్రాలను మరింత ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహ వేడుకలో ముఖ్య పాత్రను పోషిస్తోంది గౌరి సిగ్నేచర్స్.. హైదరాబాద్‌లో గౌరీ సిగ్నేచర్స్. గౌరి సిగ్నేచర్స్‌లో భాగమైన U&G పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయటంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. త్వరలో పెళ్ళి కానున్న బ్యాట్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాం బి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన డిజైన్స్‌ను ప్రత్యేకంగా అందిస్తుంది గౌరీ సిగ్నేచర్స్, ఆండ్ U&G.
అద్భుతమైన చీరలను గౌరిసిగ్నేచర్స్ అందిస్తే, కుటుంబంలో అందరికీ హల్ది, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు వారి అభిరుచి కి తగిన విధంగా కస్టమైజేషన్ చేయటంలో U&G ముందుంటుంది. కాంజీవరం శారీస్ అంటేనే వివాహా వేడుకల్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. కాంజీవరం శారీస్‌ని అందించడంలో గౌరీసిగ్నేచర్స్ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి నేత పరిశ్రమలు గౌరీ సిగ్నేచర్స్ కి వెన్నెముక గా నిలుస్తున్నాయి.
ఈ సంధర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సాయి మాట్లాడుతూ… తమది స్వతహాగా వీవర్స్ కమ్యూనిటీ అని, తండ్రి కౌతవరపు శ్రీనివాసరావుకి ఈ రంగంలో ఉన్న అనుభవమే ప్రీమియమ్ వెడ్డింగ్ కలెక్షన్స్ లో టాప్ ప్లేస్‌లో నిలవటానికి కారణమన్నారు. శ్రీకాంత్ కిదాంబి, శ్రావ్య వర్మ తమ స్టోర్స్‌కి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సెలబ్రిటీస్‌కి కూడా అందుబాటు బడ్జెట్‌లో డిజైనర్ దుస్తులు అందిస్తున్నామన్నారు.