భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే డైరెక్ట‌ర్ శంకర్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేష‌న్‌లో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. రామ్‌చరణ్‌ దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తరువాత నటించిన చిత్రం కావడంతో, సినిమా గురించి అందరూ ఎదురుచూశారు. తాజాగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చేసింది. అయితే శంక‌ర్ మార్క్ ఇండ‌స్ట్రీలో గేమ్ ఛేంజ‌ర్ చేసిన‌ట్టేనా? ఆడియన్స్‌ను ఈ చిత్రం ఎంత వరకు మెప్పించింది? అనేది రివ్యూలో చూద్దాం.

స్టోరీ:
రామ్‌నందన్‌ (రామ్‌చరణ్‌) ఓ ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తించి, ఆ తరువాత తను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అద్వానీ)కి ఇచ్చిన మాట కోసం మళ్లీ గ్రూప్స్‌ రాసి ఐఏఎస్‌గా తన సొంత జిల్లాకే (విశాఖ) కలెక్టర్‌గా వస్తాడు. ఆమె కోసమే తనలోని కోపాన్ని కూడా తగ్గించుకుంటాడు. విశాఖలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోగానే అక్కడి అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ, తనకున్న పవర్స్‌తో వాటిని అడ్డుకుంటాడు రామ్‌నందన్‌. ఈ క్ర‌మంలో రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య పోరాటం ఎలా ఉంటుంది? ఈ విషయంలో శ్రీకాంత్, సముద్రఖని పాత్రలు ఎలా ఉండనున్నాయి? వీరి మధ్యలో జరిగిన ఘర్షణ ఇటువంటివి? రామ్ చరణ్ జీవితంలోకి కియారా అద్వానీ ఎలా వస్తుంది? అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఏంటి? అంజలి పాత్ర ఎంతవరకు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

యాక్టింగ్ టాలెంట్:
అప్పన్నగా .. రామ్‌నందన్‌గా రామ్‌చరణ్ 2 పాత్రల్లో కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్స్‌లోనూ చెర్రీ నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన సూప‌ర్. కియారా అద్వానిది రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రనే. నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అంజలికి చాలా కాలం తరువాత నటనకి ఆస్కారమున్న పాత్ర. తన పాత్రకు న్యాయం చేసింది. అప్పన భార్యగా పార్వతిగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. ఎస్‌జే సూర్య యాక్టింగ్ సినిమాకు ప్లస్‌ అయ్యే విధంగా ఉంది. మోపిదేవి పాత్రలో ప్రతినాయకుడిగా భయపెట్టడంతో పాటు అక్కడక్కడా నవ్వించాడు. సముద్రఖని, రాజీవ్‌ కనకాల, సునీల్‌ పాత్రలు ప‌ర‌వాలేదు.

సాంకేతిక విశ్లేషణ :
స్క్రీన్‌ రిచ్‌గా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టోరీని స్పీడ్‌గా నడవడంలో సహాయపడింది. పాటల్లో విజువల్స్‌ బాగున్నాయి. కళా దర్శకత్వం, ఎడిటింగ్‌ పనితీరు మెచ్చుకునే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం రైటింగ్‌ సైడ్‌ శ్రద్దపెట్టి, ఇంకాస్త బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది. ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు రచన విభాగంలో చేయాల్సిన స్థాయిలో కసరత్తులు జరగలేదనిపిస్తుంది.

సినిమా కథ సాధారణంగా ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ డ్రామాను కచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయడంలో శంకర్ అక్కడ తడబడినప్పటికీ ఓవరాల్ గా సినిమా మొత్తంలో సక్సెస్ చేయడమే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటువంటి కథలు కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ ఈ సినిమాలో ముందుగా మనం చూడవలసింది డైరెక్షన్ ఇంకా స్క్రీన్ ప్లే. డబ్బింగ్ కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం లెగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంది.

ఒక మంచి ఫుల్ లెంత్ పొలిటికల్ డ్రామా చూడాలంటే ఫ్యామిలీతో సహా చూడదగిన చిత్రం గేమ్ చేంజర్.

Rating : 3.25 / 5

 

 

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *