మల్లంపల్లి, ములుగు: డిఎన్‌ఆర్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లంపల్లిలో జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వజ్జ తిరుపతి అధ్యక్షతన, డిఎన్‌ఆర్ ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాపరెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని మాట్లాడుతూ, ములుగు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను డిఎన్‌ఆర్ ట్రస్ట్ ఆర్థికంగా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, వారు ఉన్నత విద్యలో ఎవరిపై ఆధారపడకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఆర్థికంగా చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ఐఐటీ బాసరలో సీట్లు సాధించిన విద్యార్థులకు లాప్‌టాప్‌లు, పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయడం గొప్ప కార్యక్రమమన్నారు.
మొత్తం 11 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఇందులో నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹3000, నలుగురికి ₹2000, ముగ్గురికి ₹1000 చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, మెడల్స్ అందజేశారు. ఐఐటీలో సీటు సాధించిన బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థికి లాప్‌టాప్ అందజేశారు. ఈ పురస్కారాలు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి జీవిత లక్ష్యాలను సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని పాణిని అన్నారు. గత 15 సంవత్సరాలుగా డిఎన్‌ఆర్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వర్క్‌బుక్స్ అందజేస్తూ ములుగులో నాణ్యమైన విద్యకు పునాదులు వేసిందని ప్రశంసించారు.
డిఎన్‌ఆర్ ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, ములుగు ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి డిఎన్‌ఆర్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా, నాణ్యమైన విద్యకు అవసరమైన విద్యా కార్యక్రమాలను రూపొందించి, వాటిని పాఠశాల స్థాయిలో అమలు చేస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డిఎన్‌ఆర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని, మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాస్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు కాటం మల్లారెడ్డి, ఆర్షం రాజు, గొల్లపల్లి సాంబయ్య, సైకం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కందాల రామయ్య, గుండెబోయిన మల్లయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, తల్లిదండ్రులు, అవార్డు గ్రహీతలు, యువకులు, విద్యాభిమానులు పాల్గొన్నారు. వారంతా డిఎన్‌ఆర్ ట్రస్ట్ సేవలను కొనియాడారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php