▪️ లాయిడ్ గ్రూప్ నుంచి న్యూ వెంచర్‌ లాంచింగ్‌
▪️ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాంచింగ్‌
▪️ ధనిక భారత్‌ మాకు మరో వ్యాపార సంస్థ కాదు- విక్రం నారాయణరావు

హైదరాబాద్‌: ప్రముఖ లాయిడ్ గ్రూప్ (Lloyd Group) సంస్థ విద్యా రంగంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. ఇప్పటికే హెల్త్‌కేర్‌ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు విద్యా రంగంలో అడుగుపెట్టి “ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌” పేరుతో నూతన వెంచర్‌ను ప్రారంభించింది. ప్రముఖుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ లాంచింగ్‌ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, మాజీ ఐఏఎస్, సివిల్స్ అకాడమి చైర్మన్ బాలలత మల్లవరపు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లాయిడ్ గ్రూప్‌ సీఎండీ విక్రం నారాయణరావు మాట్లాడుతూ —
“ఇప్పటికే మా సంస్థల ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాము. విద్యారంగంలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ను స్థాపించాము. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం బలపడాలి. నేటి విద్యార్థులు గ్లోబల్‌ స్థాయిలో పోటీ పడేలా, టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం. ఇది మా వ్యాపార విస్తరణ కాదని, సామాజిక బాధ్యతగా చేపట్టిన కార్యక్రమమని స్పష్టం చేస్తున్నాను” అని అన్నారు.

డా. జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ —
“మన విద్యా వ్యవస్థలో పునాదులు బలంగా లేవు. పదవ తరగతి దశ నుంచే మూసపద్ధతి బోధన విద్యార్థుల సృజనాత్మకతను అణచేస్తోంది. పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదు — కాన్సెప్ట్‌ అప్లికేషన్‌, ఆలోచనా స్వాతంత్ర్యం అవసరం. విద్య ఉద్యోగం కోసం కాదు, సమాజానికి సేవ చేయడానికీ, వ్యక్తిత్వ వికాసానికీ పునాది కావాలి” అన్నారు.

జె.డి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ —
“విద్య భయాన్ని తొలగించాలి, భయాన్ని సృష్టించకూడదు. విద్యార్థుల్లో శారీరక, భావోద్వేగ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సృజనాత్మక మార్పు రావాలి. క్రియేటివిటీ పెరిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి విద్యార్థి తన కాళ్లపై నిలబడేలా చేయడమే నిజమైన విద్య” అని సూచించారు.

బాలలత మల్లవరపు మాట్లాడుతూ —
“కాన్సెప్ట్‌ బేస్డ్‌, టెక్నాలజీ డ్రివ్‌డ్‌ ఎడ్యుకేషన్‌ అవసరం. ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వర్చువల్‌ రియాలిటీ క్లాస్‌రూమ్స్‌తో విద్యార్ధులకు ఆధునిక విద్య అందించనుండటం ప్రశంసనీయం. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, ‘విద్యే నిజమైన సంపద’ అనే భావంతో ఈ సంస్థ ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు.

లాయిడ్ గ్రూప్‌ డైరెక్టర్‌ మహేష్‌ కరతేకర్ మాట్లాడుతూ —
“ఒక కుటుంబంలో ఒకరు చదువుకుంటే, ఆ చదువు వెలుగు మొత్తం కుటుంబానికీ విస్తరిస్తుంది. విద్యే ప్రతి ఇంటిని అభివృద్ధి దిశగా నడిపిస్తుంది” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో లాయిడ్ గ్రూప్‌, ధనిక్‌ భారత్‌ సంస్థల డైరెక్టర్లు విక్రమ్‌ అజయ్‌బాబు, విక్రమ్‌ సురేంద్ర, CA భీముని తిరుపతి రెడ్డి, కందిమళ్ళ సాంబశివరావు, ఆళ్ల గిరిబాబు, రామ్‌ చింతలపూడి, తోటకూర విజయ్‌భాస్కర్‌, విక్రమ్‌ రాఘవ, విక్రమ్‌ నాగార్జున, కందిమళ్ళ పూర్ణచంద్రరావు, కొమ్మినేని మురళి, రాయపాటి ఫణీంద్ర తదితరులు పాల్గొని ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ భవిష్యత్‌ విజన్‌ వివరించారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *