ఒడియా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా విశేష అభిమానాన్ని సంపాదించుకున్న బాబుషాన్ మొహంతి జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అంతర్యామి’ చిత్రబృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.
అమ్రిత్ ప్రెజెంట్స్, శివ సత్యం ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబుషాన్ మొహంతి కథానాయకుడిగా నటిస్తుండగా, వేద్విక సోని కథానాయికగా కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటీమణులు ఆమని, కస్తూరి, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి శివ సత్యం దర్శకత్వం వహిస్తుండగా, అమ్రిత్ నిషాద్, జ్ఞానరంజన్ సాహు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బర్త్‌డే పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చిత్రబృందం తెలిపింది.
బాబుషాన్ మొహంతి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ప్రత్యేక పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, త్వరలోనే ‘అంతర్యామి’ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
అమ్రిత్ ప్రెజెంట్స్
చిత్రం: అంతర్యామి
హీరో: బాబుషాన్ మొహంతి
హీరోయిన్: వేద్విక సోని
ఇతర ముఖ్య నటి నటులు: ఆమని, కస్తూరి, శ్రీతం దాస్
దర్శకుడు: శివ సత్యం
ప్రొడ్యూసర్స్ – అమ్రిత్ నిషాద్ జ్ఞానరంజన్ సాహు,
ఛాయాగ్రహణం: కె. గుణశేఖరన్
సంగీతం: జీజే కార్తికేయన్
ఎడిటర్: అశోక్ బోయిన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బుస్సా
బాలరాజు
పీఆర్ &డిజిటల్: కలర్‌ఫుల్ డిజిటల్ మీడియా
