▪️ భావోద్వేగాల‌ను ఆవిష్క‌రించే చిత్రం
▪️ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న శివాజీరాజా
▪️ పోస్ట‌ర్ లాంచ్ చేసిన సినీ ప్ర‌ముఖులు

హార్ట్ ట‌చింగ్ స‌బ్జెక్టుతో బ‌ల‌మైన సెంటిమెంట్‌ తో ‘మాతృదేవోభ‌వ’ లాంటి మ‌రో అరుదైన సినిమా రాబోతోంది. క‌మ‌ల్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్దేష్ ద‌ర్శ‌క‌త్వంలో, శివాజీరాజా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ ‘నాన్నా మ‌ళ్లీ రావా..!’ మూవీ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది. హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రీ టీ. ప్ర‌స‌న్న‌కుమార్, ద‌ర్శ‌క‌నిర్మాత బాబ్జీ, నిర్మాత వై. సురేంద‌ర్ రెడ్డి, నిర్మాత న‌రేష్ వ‌ర్మ.. పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ‘నాన్నా మ‌ళ్లీ రావా..!’ మూవీ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న శివాజీరాజా మాట్లాడుతూ.. ఇలాంటి భావోద్వేగంతో మిలిత‌మైన‌ సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తాయ‌ని, కుటుంబ స‌మేతంగా చూడ‌గ‌లిగే ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిలో భావోద్వేగాలు నింపుతాయ‌ని అన్నారు.

టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రీ టీ. ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ.. ”పిల్ల‌ల కోసం బాధ‌ల‌ను దిగ‌మింగుకుని, జీవితాన్నే ప‌ణంగా పెట్టేసే నాన్న విలువ అమ్మ త‌మ పిల్ల‌ల‌కు చెప్పాలి. ‘నాన్నా.. మ‌ళ్లీ రావా..’ అంటూ ప్ర‌తి ఒక్క‌రిని భావోద్వేగానికి గుర‌య్యే సినిమా ఇది..” అని అన్నారు.

ద‌ర్శ‌క‌నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ… ”దేవుడు ఉన్నాడా? లేదా? అనే అంశం పక్కన పెడితే నాన్న దేవుడు. దేవుడంటే నాన్నే.” అని అన్నారు. ఈ సంద‌ర్భంగా అక్కినేని సినిమాలోని ‘ఓ నాన్న..’ పాట పడుతూ బాబ్జీ భావోద్వేగం ఆపుకోలేక‌పోయారు.

దర్శకుడు మాట్లాడుతూ… ”వెంకన్న క్యారెక్టరే నన్ను ఈ కథ రాయించినట్టు అనిపించింది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమా చెప్ప‌లేనంత భావోద్వేగం ప్రేక్ష‌కుల‌ను పట్టేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను..” అని అన్నారు.

సినిటేరియా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ”ప్రతి ఒక్కరికి నిజ‌మైన‌ హీరో నాన్నే. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. అంత‌టి బ‌ల‌మైన ఎమోష‌న్ ఈ సినిమాలో క్యారీ అవుతుంది..” అని అన్నారు.

ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ రోసి రెడ్డి మాట్లాడుతూ.. నాన్న గురించి మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది. డైరెక్ట‌ర్ నిర్దేష్ గారు రాసుకున్న క‌థ సినిమాను ఎంతో ఎత్తులో నిల‌బెడుతుంది. భావోద్వేగాల‌ను మిలితం చేస్తూ వ‌స్తున్న ‘నాన్నా మ‌ళ్లీ రావా..!’ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది..” అని అన్నారు.

పోస్ట‌ర్ లాంచ్‌కు వ‌చ్చి చిత్ర‌యూనిట్‌ను ఆశీర్వ‌దించిన సినీ పెద్దల‌కు ఈ చిత్ర నిర్మాత‌ డా. డీ. ఉమామ‌హేశ్వ‌ర రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్తిస్థాయిలో న‌చ్చే స‌బ్జెక్టుతో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టు ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింద‌న్నారు.

చిత్ర యూనిట్:

న‌టీన‌టులు: శివాజీరాజా, ప్ర‌భావ‌తి
డీఓపీ: డీవై గిరి,
మ్యూజిక్: ఆర్మ‌న్ మెరుగు,
కో-డైరెక్ట‌ర్: సుధీర్ వ‌డ్ల‌,
ఫైట్స్: పీ. స‌తీష్,
ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూస‌ర్: రోసి రెడ్డి,
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: నిర్దేష్‌,
నిర్మాత‌: డా. డీ. ఉమామ‌హేశ్వ‌ర రావు.
సినీ బ్రాండింగ్: సినిటేరియా మీడియా వ‌ర్క్స్
పీఆర్వో: మీడియాబాస్ నెట్‌వ‌ర్క్

 

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *