హైద‌రాబాద్: ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (PAN) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ హయాత్ ప్లేస్‌లో 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమం ఆహార పోషకాహార ప్రాధాన్యత, ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ డైయెట్స్ ద్వారా నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCDs) నిర్వహణపై చర్చించడానికి వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులను ఒక వేదికపైకి తెచ్చింది.

ఈ సదస్సులో డాక్టర్ హేమలత, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌జీన ష‌హిన్, డాక్టర్ ప్రత్యుష నెరెళ్ల వంటి వైద్య నిపుణులు ప్ర‌జెంట్ చేసిన‌ ఆధునిక రిసెర్చ్ ఫ‌లితాలు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయి. డాక్టర్ రాజేందర్ రామగిరి ఆధ్వర్యంలో డయాబెటిస్ రిమిషన్‌పై కేస్ ప్రెజెంటేషన్, జీవన శైలిలో మార్పులతో వ‌చ్చిన అద్భుత‌ ఫ‌లితాల‌ను వివ‌రించారు. IBD, శోగ్రెన్ సిండ్రోమ్ నుండి రిమిషన్ సాధించిన మూడు రోగుల కేస్ స్టడీ, పోషకాహారం ద్వారా సాధించిన ఫలితాలను తెలిపారు.

డాక్టర్ సుందీప్ లక్టాకియా మోడరేట్ చేసిన ప్యానెల్ డిస్కషన్, వైద్య రంగంలో పోషకాహారం సమగ్రతపై చర్చించారు. డాక్టర్ హేమలత ప్రసంగంలో నిరోధక ఆరోగ్యం, వ్యాధి నిర్వహణలో పోషకాహారం ప్రాధాన్యతను హైలైట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారు ఒకరితో ఒకరు కొత్త ఆలోచనలను పంచుకున్నారు. పోషకాహారంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో PAN ఇండియా తన కట్టుబాటును మరింత బలోపేతం చేసింది.

ఈ CME ప్రోగ్రామ్ PAN ఇండియా లక్ష్యమైన ఆహార సంబంధిత‌ వ్యాధులను నివారించి, పర్యావరణ అనుకూల ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా మరొక మైలురాయిగా నిలిచింది.


 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *