▪️ ప్రాచీన ద్వారక నగరాన్ని పునరావిష్కరించేందుకు ‘IT’S 6TH WOW’ సంస్థ కృషి
▪️ ద్వారకా సముద్రంపై రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ జల జప దీక్ష
▪️ పరిశోధనల వివరాలు తెలిపిన ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్
▪️ రవీంద్రజిత్ టీంకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందజేత
▪️ ఫిబ్రవరిలో ద్వారకా సముద్రంపై మరో గిన్నిస్ రికార్డు
హైదరాబాద్: సముద్ర గర్భంలో ఉన్న పురాతన గుజరాత్‌లోని ద్వారక నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన పరిశోధనలో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇట్స్ సిక్స్‌త్ వావ్ (IT’S 6TH WOW) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారక నగరంపై కొన్నేళ్లుగా చేస్తున్న పరిశోధనలు, కార్యక్రమాలు గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా పొందింది. ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం (World Sunken City Day) సందర్భంగా (డిసెంబర్ 21న) ద్వారకలో జై ద్వారకా క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన శ్రీకృష్ణ జల జప దీక్ష ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జల జప దీక్ష చేసిన రవీంద్రజిత్ టీమ్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జడికేటర్ స్వర్ణ శ్రీ సర్టిఫికెట్ అందించి అభినందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ మాట్లాడుతూ.. ”డిసెంబర్ 21న ద్వారకలో ‘జై ద్వారకా’ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ జల జప దీక్ష నిర్వహించాము. గుజరాత్ పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డుల్లో భాగమవ్వడం గర్వంగా ఉంది. ప్రాచీన ద్వారక నగరంను పునరావిష్కరించేందుకు, సముద్ర తలాలలో మళ్లీ తవ్వకాలను ప్రారంభించమని భారత ప్రభుత్వానికి వినతి చేయడం ఈ శ్రీకృష్ణ జల జప దీక్ష ముఖ్య ఉద్దేశం. మా ‘ఇట్స్ సిక్స్‌త్ వావ్’ సంస్థ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించిన గుజరాత్ ప్రభుత్వా, కేంద్ర ప్రభుత్వ టూరిజంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.” అని చెప్పారు.
రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ జల జప దీక్ష కార్యక్రమంలో జరిగిన ముఖ్య ఘట్టాలు
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహించిన స్థలంలోనే.. రవీంద్రజిత్‌తో పాటు ఏడుగురు స్కూబా డైవర్లతో సముద్రంలో జల జప దీక్ష నిర్వహించారు. అదే సమయంలో సముద్రంపైన సగభాగం నీటిలో శ్రీకృష్ణ జల జప దీక్షలో 70 మంది పాల్గొన్నారు. సముద్ర గర్భంలోని పురాతన నగరం కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు విజయవంతమవ్వాలని ఆశిస్తూ హవన పూజ నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారక నగరంపై మరోసారి అందరి దృష్టిని నిలిపింది. సముద్రంలో అత్యధిక మంది డైవర్లు ఆధ్యాత్మిక సాధన చేసిన సంఘటనగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమం కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ద్వారక కథ ఆధారంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
గిన్నిస్ రికార్డు
ద్వారక నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ పరిశోధించి పలు ఆధారాలు సేకరించారు ”ఇట్స్ సిక్స్‌త్ వావ్” సంస్థ సభ్యులు. ఈ నేపథ్యంలో “జై ద్వారకా క్యాంపైన్”లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో “ప్రపంచ పర్యాటక రేస్‌లైన్స్ డే” సందర్భంగా ఫిబ్రవరి 17న ద్వారకా సముద్రం నీటిపై “జై ద్వారకా” లోగో రూపాన్ని700 మందితో రూపొందించబోతున్నారు. ఈ ప్రయత్నం గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకోబోతోంది. ఈ లోగో శ్రీ కృష్ణుని 7 నెమలి రెక్కలుగా, ప్రపంచంలోని 7 ప్రాచీన నాగరికతలను సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ చరిత్రకారుడు, ప్రపంచ పర్యాటక దినోత్సవ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) సభ్యుడు, మాడ్రిడ్-స్పెయిన్ జనరల్ సెక్రటరీ, ”ఇట్స్ సిక్స్‌త్ వావ్” జై ద్వారకా ప్రచార ఆర్గనైజర్ రవీంద్రజిత్, భారత భారతి జాతీయ అధ్యక్షుడు వినయ్ పాత్రలే, జై ద్వారకా ప్రచార ఆర్గనైజర్ & ఇట్స్ సిక్స్‌త్ వావ్ ప్రెసిడెంట్ షాహీ ఖాన్, జై ద్వారకా ప్రచార అంతర్జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ మీనాక్షి పద్మనాభన్, IT’S 6TH WOW ఇండియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కొండకింది, తెలంగాణ చైర్మన్ కలదర్ వల్లం, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జడికేటర్, కూచిపూడికి అంతర్జాతీయ రాయబారి స్వర్ణ శ్రీ, ఇంటర్నేషనల్ చైర్మన్ కిషోర్ పుల్ల తదితరులు పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
![BREAKING NOW](http://breakingnewstv.co.in/wp-content/uploads/2022/06/B-APP-AD-copy.jpg)
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php