టైటిల్: భళారే సిత్రం
విడుదల తేదీ: 08-08-2025
తారాగణం: శివ, కృష్ణ, దివ్య డిచోల్కర్, మౌనిక
DOP: సతీష్
నిర్మాతలు: శ్రీనివాసరావు సవరం, సుబ్బారావు
దర్శకుడు: తుమ్మా లక్ష్మారెడ్డి
బ్యానర్: శ్రీ లక్ష్మి క్రియేషన్స్
విడుదల: SKML మోషన్ పిక్చర్

ఇద్దరు జంటలు, రెండు వేర్వేరు లోకాలు… ఒక్క నిజం బయటపడితే? నవ్వులు, అనుమానాలు, భావోద్వేగాలు—all in one ప్యాక్‌—అదే ‘‘భళారే సిత్రం’’. కొత్తగా పెళ్లయిన ఇద్దరు జంటల మధ్య పాత సంబంధం వెలుగులోకి వస్తే, వారి మ్యారేజ్ లైఫ్ ఏ మలుపు తిరుగుతుంది అనేది ఈ సినిమా చెప్పే కథ.

కథ
శివ (శివ రాజ్‌పుత్) – సీత ఒక జంట‌. పాండు (Panddu Chelimi) – దివ్య (Divya Dicholkar) మరో జంట‌. సంతోషంగా సాగుతున్న ఈ ఇద్దరు జంటల జీవితాల్లోకి పాత రహస్యం దూసుకొస్తుంది. ఒక్కరికి మరోకరి మధ్య ఉన్న అనూహ్య పరిచయం బయటపడగానే, అనుమానాల మేఘం కమ్మేస్తుంది. హాస్యం, తగువులు, ఎమోషనల్ మలుపులు—అన్నీ కలసి కథను ఎక్కడికి తీసుకెళ్తాయి? ఆ సమాధానం థియేటర్‌లోనే!

నటీనటుల ప్రదర్శన
శివ – కూల్ లుక్, నేచురల్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేశాడు.
దివ్య డిచోల్కర్ – ఎమోషనల్ సీన్స్‌లో బలంగా నిలిచింది.
పాండు చెలిమి – కామెడీ టైమింగ్‌తో వినోదం పంచాడు.
కృష్ణ – మౌన పాత్రలో బాడీ లాంగ్వేజ్‌తో బాగా కనెక్ట్ అయ్యాడు.
కౌసురి మౌనిక – తన పాత్ర గంభీరతను సహజంగా మలిచింది.

టెక్నికల్ పాయింట్స్
దర్శకత్వం (లక్ష్మారెడ్డి తుమ్మ) – సింపుల్ కథకు సరదా మలుపులు జోడించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేశారు.

మ్యూజిక్ (సమీ కట్టుపల్లి) – పాటలు ఓకే, కానీ BGM భావోద్వేగ సన్నివేశాల్లో బాగుంది.

DOP సతీష్ – విజువల్స్‌లో భావాలను బాగా పటించారు.

ఎడిటింగ్ (శ్రీనివాసరావు) – ఫస్ట్ హాఫ్ కట్టిపడేసేలా, సెకండ్ హాఫ్ కొంచెం స్లో.

విశ్లేషణ
గ్రామంలో చదువులేని వారైనా, నగరంలో చదువుకున్న వారైనా—మ్యారేజ్ లైఫ్‌లో వచ్చే సమస్యలు ఒకేలా ఉంటాయి అన్న విషయాన్ని డైరెక్టర్ క్లియర్‌గా చూపించాడు. కొత్త జంటల మధ్య జరిగే సంఘర్షణలు, పాత రహస్యాల ప్రభావం, మలుపులు—ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. హాస్యం, ఎమోషన్ మిక్స్ ఈ సినిమాకి బలమైన పాయింట్.

తీర్పు
‘‘భళారే సిత్రం’’—సింపుల్ కానీ ఎంగేజింగ్ ఫ్యామిలీ డ్రామా. కొత్త జంటల మద్య జరిగే కథలు, భావోద్వేగ పరిణామాలు, నవ్వులు—all-in-all ఒక సరదా ప్యాకేజ్.

రేటింగ్: 3.25 / 5

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *