మీడియా మిత్రుల చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరణ

హైదరాబాద్‌: “వృక్షో రక్షతి రక్షితః” అని పెద్దలు చెప్పారు. ఆ అర్థాన్ని హృదయానికి హత్తుకునేలా ప్రేక్షకుల ముందు ఉంచుతూ, వన సంరక్షణ ప్రాధాన్యాన్ని తెలిపే చిత్రంగా తెరకెక్కింది ‘కలివి వనం’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో, ప్రకృతి సౌందర్యం మధ్య చిత్రీకరించిన ఈ చిత్రానికి రాజ్ నరేంద్ర రచన, దర్శకత్వం వహించారు. మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాణంలో ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. “ప్రకృతిని పూజించండి, ప్రేమించండి, రక్షించండి” అనే నినాదంతో రూపొందిన ‘కలివి వనం’ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, సీనియర్ జర్నలిస్టులు రవిచంద్ర, ఫణి, కేశవ చారి, సినీ జోష్ రాంబాబు, శివ మల్లాల, రాధాకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ—
“అడవులు, చెట్లు మన జీవితంలో ఎంత ముఖ్యమో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. మా దర్శకుడు రాజ్ నరేంద్ర గారు, నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బుకు ఎక్కడా వెనకాడకుండా రాత్రింబవళ్లు కష్టపడి షూట్ చేశారు. ఇది చిన్న సినిమా కాదు, గొప్ప సందేశంతో కూడిన పెద్ద సినిమా. మీడియా మిత్రులు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను,” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్‌.కె. మాట్లాడుతూ—
“ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన ప్రేక్షకులకూ ఈ సినిమా 100% నచ్చుతుంది. ఇలాంటి అర్థవంతమైన సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ అన్న, నిర్మాతలకు ధన్యవాదాలు,” అన్నారు.

దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ—
“ఇప్పుడు చిన్న సినిమాకి ఒక గెస్ట్ రావడం కూడా కష్టం. కానీ మా కోసం గెస్టుల కంటే గొప్ప బలం మీడియా మిత్రులు. వాళ్లే మా బలగం. అందుకే ట్రైలర్‌ను వాళ్ల చేతుల మీదుగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.

మా పోస్టర్‌పైన ‘సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా’ అని రాశాం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి తప్పనిసరిగా చూడాల్సిన ఫ్యామిలీ సినిమా ఇది. పిల్లలకు ప్రకృతి గురించి అవగాహన కలిగించేలా రూపొందించాం. వర్షం దేవుడు కురిపిస్తున్నాడని కాకుండా — ఒక మొక్క నాటితే చినుకులు కురుస్తాయని చెప్పేలా, ప్రకృతిపట్ల ప్రేమ, గౌరవం పెంచేలా సినిమా ఉంటుంది,” అని చెప్పారు.

తారాగణం: రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, నాగదుర్గ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ – ఏఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు – మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి
రచన-దర్శకత్వం – రాజ్ నరేంద్ర
సినిమాటోగ్రఫీ – జియల్ బాబు
సంగీతం – మదీన్ ఎస్‌.కె
ఎడిటర్ – చంద్రమౌళి
మాటలు – కోటగల్లి కిషోర్
పాటలు – కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల, కమల్ ఇస్లావత్
పీఆర్ఓ – శ్రీధర్ (సిటీ విజన్)

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *