ప్రపంచంలోని ప్రవాసుల కోసం ‘స్వదేశం’ (swadesam) సేవలు ఎంతో మంది ఎన్నారైలకు ఉపయోగపడుతున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వివిధ దేశాల్లో ఎంతో మంది భారతీయులు స్థిరపడ్డారు. వారికి భారత్ నుంచి ఎన్నో రకాల సర్వీసులు అవసరం అవుతుంటాయి. ఆ సేవలు పొందెందుకు దగ్గరివారికి లేదా తెలిసినవారికి ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్కోసారి వారు కూడా అందుబాటులో ఉండరు. ఇలాంటి సమస్యలు చాలామంది ఎన్నారైలు ఎదుర్కొంటున్నారు. వారందరికీ ‘స్వదేశం‘ (swadesam) వన్ స్టాప్ సొల్యూసన్ అని ‘మీడియాబాస్ నెట్వర్క్’ సంస్థ నిర్వహకులు తెలిపారు. 56 దేశాల్లోని ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎన్నారైలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేవలు అందిస్తున్నామని, త్వరలో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా తమ సేవలు విస్తరించే ప్రక్రియ చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని, ఏటా దేశం నుంచి 25 లక్షల మందికి పైగా విదేశాలకు వలస పోతున్నారని వారందరికి అవసరమైన సేవలను అందించేందుకు ‘స్వదేశం‘ సిద్దంగా ఉందని మీడియాబాస్ సీఈవో స్వామి ముద్దం చెప్పారు.
‘స్వదేశం‘ సర్వీసుల్లో మీడియా కంటెంట్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, లీగల్, ప్రాపర్టీ వ్యవహరాలు, రిజిస్ట్రేషన్లు, ఫ్రీలాన్స్ ఉద్యోగులు, వస్తువుల డెలివరీ, సెలబ్రెటీ మేనేజ్మెంట్, మాట్రిమోనీ సేవలు, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ సర్వీసులు.. వంటి ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నారైలకు ఎలాంటి సర్వీసులు కావాలన్నా వెబ్సైట్లోని ఫామ్లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.