టమాటా.. విలువైన పదార్థంగా మారిపోయింది. టమాటా పంటను దొంగల నుంచి కాపాడుకోవటం కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టుకుంటున్నారు రైతులు. పొలాల్లో రాత్రీ పగలు కాపలాకాస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమామా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి 250 రూపాయల వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో 300 రూపాయల వరకు పలకొచ్చని అంచనా.. ఈ క్రమంలోనే ఈ ఏడాది టమాటా రైతులు బాగా లాభపడ్డారు.. ఇన్నాళ్లు కనీస ధర లేక రోడ్లపై పారబోసిన టమామా.. ఇప్పుడు సిరులు కురిపిస్తుంది. రాత్రికి రాత్రి కోటేశ్వరులను చేస్తుంది టమాటా..
మహారాష్ట్ర పూణె జిల్లాకు చెందిన తుకారం భగోజీ కుటుంబం 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూనే ఉంది. ఆయా సీజన్ల ఆధారంగా పంటలు పండిస్తుంది. ఐదేళ్లుగా టమాటా పంట పండిస్తుంది. ఎప్పుడూ నష్టాలే.. ఈ ఏడాది మాత్రం 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు తుకారం. నెల రోజులుగా పంట చేతికి వస్తూ ఉంది. 12 ఎకరాల్లో 13 వేల బాక్సుల టమాటా దిగుబడి వచ్చింది. ఒక్కో బాక్సులో 20 కిలోల టమాటా ఉంటుంది.
మొత్తం 13 వేల డబ్బాల టమాటాను విడతల వారీగా విక్రయించింది తుకారం ఫ్యామిలీ. తుకారం కోడలు సోనాలి ఆధ్వర్యంలో నారాయణగంజ్ మార్కెట్ లో వీటిని అమ్మారు. టమాటా నాణ్యత ఆధారంగా కిలో 80 నుంచి 125 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముడుపోయింది పంట. జులై 14వ తేదీ ఒకే రోజు 900 బాక్సులను అమ్మగా.. 18 లక్షల రూపాయలు వచ్చింది. అదే విధంగా 2 వేల 500 బాక్సులను 100 రూపాయల చొప్పున విక్రయించింది ఆ కుటుంబం. కిలో 80 రూపాయల చొప్పున 6 వేల డబ్బాలను.. ఇలా నెల రోజుల్లో 13 వేల బాక్సులను అమ్మగా.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చాయి.
20 ఏళ్ల దరిద్రం మొత్తం ఈ ఒక్క ఏడాదితో పోయిందని.. ఐదేళ్లుగా టమాటా పంటనే నమ్ముకున్నామని.. ఎప్పుడూ లాభాలు రాలేదని.. ఈసారి పంట బాగా పండటంతోపాటు.. ధర కూడా ఎక్కువగా ఉండటంతో.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చిందని చెబుతోంది తుకారం కుటుంబం. ప్రస్తుతం పొలంలో ఇంకా కొంచెం పంట ఉందని.. ధర ఇదే విధంగా ఉంటే.. రాబోయే 15 రోజుల్లో మరో 50 లక్షల రూపాయల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
…
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews