మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన ఇటీవ‌ల‌ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్‌ దంపతులకు మహాలక్ష్మి జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. ఇక మెగా ప్రిన్సెస్‌ వచ్చింటూ అభిమానులు కూడా ఆనందడోలికల్లో మునిగిపోయారు. అనంతరం లలితా సహస్ర నామం పదాలు కలిసేలా తమ కూతురుకు క్లీంకార అని నామకరణం చేశారు. కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈక్రమంలోనే తమ బిడ్డ ఆహ్లాదకర వాతావరణంలో పెరిగేందుకు ఒక ప్రత్యేక గదిని సిద్ధం చేశారు రామ్‌ చరణ్‌ దంపతులు. స్పెషల్‌ రూం అనగానే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు. చిన్నారి పెరిగేందుకు అనువైన వాతావరణం ఉండేలా పిల్లలు కోరుకునే బొమ్మలతో గదిని అందంగా తీర్చిదిద్దారు. ఫారెస్ట్‌ థీమ్‌లో అంటే అడవిలో ఉండే జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే గదిని డిజైన్‌ చేశారు.

అలాగే వైట్‌ థీమ్‌లో సోఫాలు, మ్యాట్‌లు, టేబుల్స్‌ ఇలా ఎంతో ఆహ్లాదభరితంగా ఉండేలా గదిని ఏర్పాటుచేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ ఈ స్పెషల్ రూమ్‌ను డిజైన్‌ చేయించారు. తాజాగా తన కూతురుకు సంబంధించిన గదిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఉపాసన. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మెగాభిమానులంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *