Chandrayaan-3 Mission 2023: జాబిలిని అందుకునేందుకు శ్రీ‌హ‌రి కోట నుంచి చంద్ర‌యాన్-3 దూసుకెళ్లింది. చంద్రున్ని అందుకునేందుకు ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. చంద్రయాన్ 1తో నీటి జాడలు గుర్తించింది. చంద్రయాన్ 2ని ప్రయోగించి.. చివరి నిముషంలో ఫెయిల్ అయింది. దాదాపుగా సక్సెస్ అయిందనుకున్న సమయంలో టెక్నికల్ సమస్య రావడం.. క్రాష్ ల్యాండింగ్ కావడంతో చంద్రుడి జాడను పట్టుకోలేకపోయాం. కానీ.. నాసా ఎప్పుడో చంద్రుడి అడుగు జాడలను కనిపెట్టింది. 1969లోనే జాబిల్లిపైకి వ్యోమగాములను పంపింది. వాళ్లను తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చింది. ఇదంతా 8 రోజుల్లోనే పూర్తైంది. కానీ మనం కనీసం రోవర్‌ని కూడా ఎందుకు పంపలేకపోతున్నాం.

చంద్రుడిపై అన్వేషణలో భాగంగా భారత్ చేపట్టిన మిషన్లు ఎన్ని రోజులు పట్టాయో ఇప్పుడు చూద్దాం.

చంద్రయాన్-1..
ఆగస్ట్ 28, 2008న రాకెట్ ప్రయోగం
నవంబర్ 12, 2008న చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్
77 రోజుల సమయం
చంద్రయాన్-2
జులై 22, 2019న రాకెట్ ప్రయోగం
సెప్టెంబర్ 6, 2019న క్రాష్ ల్యాండింగ్
48 రోజుల సమయం
చంద్రయాన్-3
జులై 14న 2.35PM ప్రయోగించనున్న నాసా
ఆగస్ట్ 23 లేదా 24న ల్యాండ్ అయ్యే అవకాశం
40 రోజులు పడుతుందని అంచనా..
1969 జులై 16న… అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ రాకెట్ సాయంతో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది నాసా. జులై 16 ఉదయం 8 గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన.. అపోలో 11 వ్యోమనౌక 102 గంటల 45 నిముషాల తర్వాత అంటే జులై 20న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం 4 రోజుల 6 గంటల్లోనే వాళ్లు చంద్రుడిపైకి చేరుకున్నారు. చంద్రుడిపై వ్యోమగాములు ల్యాండ్ అయిన ఆ వీడియోను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. జాబిల్లిపై తొలి అడుగు.. మానవ జాతికి అతిపెద్ద అడుగు అంటూ నాసా అప్పట్లో ట్వీట్ చేసింది.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *