టైటిల్: పురుషోత్తముడు
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీశర్మ, ముకేశ్ ఖన్నా తదితరులు
దర్శకుడు: రామ్ భీమన
నిర్మా తలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్
విడుదల తేదీ: 26 జూలై, 2024
చిన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇటీవల మంచి హిట్ లేదు. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కాస్త గ్యాప్ తీసుకొని పురుషోత్తముత్తడు అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటవల టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. తండ్రి(మురళీశర్మ) అతన్ని తన పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీకి CEOని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసు(రమ్యకృష్ణ). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు(విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రామ్ కట్టుబట్టలతో అజ్ఞాతంలోకి వెళ్లకళ్ల తప్పదు. రాజమండ్రి దగ్గరలోని కడియపులంక అనే గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో పూలతోటలు నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గరగ్గ పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి)ట్టికుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
రామ్ పాత్రకు రాజ్ తరుణ్ పూర్తి న్యాయం చేశాడు. గ్లామర్ ఆండ్ యాక్టింగ్‌లో గతం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. హీరోయిన్ హాసిని సుధీర్ గ్లామర్ యూత్‌ను ఎట్రాక్టు చేస్తుంది. ఇక సీనియర్ నటి రమ్యకృష్ణ తన పాత్రకు నిండుతనం తెచ్చారు. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.
ఎలా ఉందంటే?
హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమంలో అన్యాయానికి గురవుతున్న పేద ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయంగా నిలబడతాడు. ఇలాంటి పాయింట్స్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా కథను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాటలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా.
రేటింగ్: 3.5 / 5
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.