నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియ, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ , హర్షవర్ధన్.
సాంకేతిక వర్గం:
బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మించారు. కులం, మతం, జెండర్ అనే సున్నితమైన అంశాలపై బలమైన మెసెజ్ ఇస్తూ కుటుంబంలో ఏర్పడే భావోద్వేగాలను, సవాళ్లను చూపిస్తూ తెరకెక్కించిన సారంగదరియా చిత్రం తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రాజా రవీంద్ర కీలక పాత్రలో, దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్‌లలోకి వచ్చింది. శివచందు, యశస్విని, మొయిన్ మొహమద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ: కాలేజ్ లెక్చరర్ కృష్ణ కుమార్ (రాజా రవీంద్ర)కు ముగ్గురు పిల్లలు. ఆయన తన భార్య లక్ష్మి (నీల ప్రియ) ముగ్గురు పిల్లలు అర్జున్ (మొయిన్ మొహమద్), సాయి (మోహిత్ పేడాడ), అనుపమ (యశస్వినీ)తో ఓ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. పెద్ద కొడుకు అర్జున్.. లవ్ ఫెయిల్యూర్‌తో మద్యానికి బానిస అవుతాడు. చిన్న కొడుకు సాయి.. అమ్మాయిలతో గడుపుతూ ఉంటాడు. ఫాతిమ (మధులత)ను ప్రేమిస్తాడు. ఇక కృష్ణకుమార్ కూతురు అనుపమ అందాల పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకోవాలకుంటుంది. ఇద్దరు కొడుకులు చేసే చెడు పనులతో తండ్రి కృష్ణకి చెడ్డపేరు వస్తుంది. అయితే ఆయన కూతురు అనుపమ గురించి ఇరుగుపొరుగు వారికి ఓ నిజం తెలుస్తుంది. అవమానంతో అనుపమ ఆత్మహత్యయత్నం చేస్తుంది. ఇంతకీ అనుపమ జీవితంలో దాగిన ఆ నిజం ఏంటి? అనుపమ తన జీవిత లక్ష్యమైన అందాల పోటీలో కిరీటం గెల్చుకుందా? కృష్ణ కుమార్ తన సమస్యల నుంచి బయటపడుతాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
యాక్టర్స్: ఈ సినిమాలో కీలక పాత్ర రాజా రవీంద్రది. ముగ్గురు పిల్లలతో ఏర్పడే మూడు రకాల సమస్యలను మోస్తూ, ఓ మధ్యతరగతి తండ్రిగా నటించాడు. లెక్చరర్‌గా స్టూడెంట్స్‌కు నీతి చెప్పే ఆయన తన పిల్లల వల్ల జరిగే వాటిని అవమానంతో ఎదుర్కొంటాడు. సినిమాకు రాజా రవీంద్ర నటన ప్రాణం పోషించదని చెప్పొచ్చు. నాచురల్‌గా నటించాడు. సాయిగా మోహిత్ పేడాడ, అర్జున్ పాత్రలో మొయిన్ మొహమద్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అనుపమ పాత్రలో యశస్వినీ నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. మిగతా పాత్రధారులు పరవాలేదు.
టెక్నికల్ టీమ్: ఎన్నో కోణాలతో సాగే ఈ సినిమాకు తగ్గట్టే ఎన్నో రకాల లొకేషన్స్‌లో కెమెరా పని కనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ టీమ్ ప్రతిభ మూవీలో కనిపించింది. సినిమాకు మ్యూజిక్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఎబెనెజర్ పాల్ కంపోజిషన్‌లో చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే.., ‘ఈ జీవితమంటే..’ పాటలు బాగున్నాయి. వినయ్ కొట్టి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘బాగుంది.. బాగుంది..’ అనే పాట కూడా బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు.
అనాలిసిస్: ఈ డిజిటల్ యుగంలో ఎంతో ఎదుగుతున్నా కూడా సమాజంలో ఎంతో సున్నితంగా కనిపించే కులం, మతం, జెండర్ అనే బేధాలు ఇంకా పోవడం లేదు. ఈ మూడు సమస్యలను ఎంటర్‌టైనింగ్, ఎమోషన్ కలిపి ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. ఆయన విజన్‌ను నమ్మి సినిమాను నిర్మించిన నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి అభిరుచిని అభినందించాల్సిందే. కులం కారణంగా అర్జున్ తన ప్రేమకు దూరమవడం, మతం వల్ల సాయి.. ఫాతిమను దక్కించుకోవడం కోసం సంఘర్షణ పడటం, ట్రాన్స్ జెండర్ కావడం వల్ల అనుపమ సొసైటీ నుంచి ఎదుర్కొన్న అవమానాలు. తన ముగ్గురు పిల్లల పరిస్థితి చూసి తండ్రిగా కృష్ణ పడే వేదన ఇలాంటి సన్నివేశాలన్నీ మనసుకు హత్తుకునేలా చిత్రికరించాడు దర్శకుడు. సమాజంలో ట్రాన్స్‌జెండర్ కూడా భాగమేనని, వారిని చిన్నచూపు చూడకూడదని, వారికీ అన్ని హక్కులు ఉంటాయనే విషయాన్ని అనుపమ పాత్ర ద్వారా బలంగా చెప్పిన తీరును అభినందించాల్సిందే. అనుపమ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో చూపించిన ఆత్మవిశ్వాసం, తండ్రి పాత్ర గురించి చెప్పే మాటలు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. సమాజంలోని మానవ సంబంధాలను గొప్పగా ఆవిష్కరించిన చిత్రమిది. సమాజంలోని సమస్యలు ప్రతి కుటుంబం నుంచి ఉద్భవిస్తాయని తెలిపే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగినది.
రేటింగ్ 3 / 5
BREAKINGNEWS APP
Breaking News APP