▪️ కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు
▪️ ప్రజల పక్షాన పోరాడే కాంగ్రెస్ నాయకులపై కేసులు సర్వసాధారణం
▪️ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
నారాయణపేట: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయని ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్. కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు ఎంత సాధారణమో – ప్రజల పక్షాన పోరాడే మనలాంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడం అంతే సాధారణమని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటరీ పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్యే మోహన్ కుమార మంగళం, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేకత ఉందని టీ-పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి వంటి బెబ్బులి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు కావడం గర్వకారణమని, అలాంటి నాయకుడిని గెలిపించుకునే బాధ్యత మహబూబ్ నగర్ నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు వ్యక్తుల కోసం పనిచేయకుండా పార్టీ గెలుపు కోసం పని చేసినట్లయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జ్ శివ రామ్ రెడ్డి, టీ-పీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.