విశాఖపట్నం, అక్టోబర్ 17, 2023: మన శరీరం సక్రమంగా నడవాలంటే తీసుకునే ఆహార పదార్థాలలో ప్రోటీన్ (మాంసకృత్తులు) తప్పనిసరిగా ఉండాలి. ఒక సర్వే ప్రకారం భారతీయులలో 73 శాతం మంది సరిపడినంత ప్రోటీన్ తీసుకోవడం లేదని తేలింది. 90 శాతం మందికి దీని ఆవశ్యకతపై అవగాహన లేదు. ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవాల్సిన ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ‘ఆల్మండ్ బోర్డు ఆఫ్ కాలిఫోర్నియా’ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని తాజ్ గేట్‌వేలో మంగళవారం ‘భారతదేశం ప్రోటీన్ సమస్య – సహజ దృక్పథం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రోటీన్ ఏ విధంగా సమకూర్చుకోవాలో అనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఆరోగ్య సంరక్షణలో దీని పాత్రపై కొన్ని సూచనలు చేశారు.
భారతదేశంలో చాలా మంది సరిపడినంత ప్రోటీన్ తీసుకోవడం లేదని గుర్తించారు. ప్రతి వ్యక్తి శరీర బరువులో కిలోగ్రాముకు రోజూ సగటున 0.8 గ్రాములు తీసుకోవాలని సూచించారు. అయితే, భారతీయులు సగటున శరీర బరువులో కిలోగ్రాముకు 0.6 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ఆహారంలో ప్రోటీన్ చేర్చినట్లయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. మాంసకృత్తులకు సప్లిమెంట్ గా ఉన్న వాటిని తీసుకోవడం కంటే సహజసిద్ధమైన వాటిని తీసుకోవడం మంచిదన్నారు. మాంసకృత్తులు అధికంగా ఉండే వాటిలో పప్పు దినుసులు, విత్తనాలు, సిరి ధాన్యాలు, గుడ్లు, చికెన్, చేపలు ఉన్నాయన్నారు. మొక్కలు అధారిత మాంసకృత్తులు తీసుకోవాలనుకునే వారి కోసం సోయాబీన్స్, పప్పు దినుసులు, విత్తనాలు, బాదం పప్పు ఉన్నాయన్నారు. 30 గ్రాముల బాదం పప్పు నుంచి 6.3 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయన్నారు. బాదంలో జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఈ, విటమిన్ బీ2 ఉంటాయని చెప్పారు.
మాంసకృత్తులు లేకపోవడం వల్ల శాకాహారులు బరువు పెరిగిపోతారని, జీర్ణం చేసుకునే శక్తి ఉండదని ఒక అపోహ ఉందన్నారు. మాంసకృత్తులు వల్ల బరువు తగ్గుతారని, కండరాల శక్తి పుంజుకుంటుందని తెలిపారు. భారతదేశంలో చాలా కుటుంబాలు మాంసకృత్తుల ప్రాధాన్యతను గుర్తించడం లేదని మరొక సర్వేలో వెల్లడైందన్నారు. సమతుల్య ఆహారం కోసం మాంసకృత్తుల ప్రాధాన్యతను తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సెలబ్రిటీ, ఫిటెనెస్ కోచ్ సుచేతా పాల్ మాట్లాడుతూ ఒక ఫిట్నెస్ నిపుణురాలిగా డైట్ అనేది నా జీవితంలో ప్రాధాన్యత అంశమన్నారు. కండరాల పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్లు కారణమని గుర్తించానన్నారు. ప్రతిరోజు అహ్లాదంగా ఉండటానికి బాదం తీసుకుంటానని చెప్పారు. ఆకలి లేకుండా చేయడానికి బాదం తోడ్పడుతుందన్నారు. స్నాక్స్ గా వీటిని తీసుకుంటానని తెలిపారు. మంచి శరీర ఆకృతి కోసం వీటిని తింటానన్నారు. ఏ విధమైన మాంసకృత్తులు తీసుకోవాలన్న దానిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమిష్టి కృషి వల్ల మనం మాంసకృత్తుల సమస్యను అధిగమించవచ్చని తెలిపారు.
కాలిఫోర్నియాలోని బాదంపప్పులు సహజమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియాలోని 7,600 కంటే ఎక్కువ బాదం సాగుదారులు, ప్రాసెసర్ల తరపున మార్కెటింగ్, వ్యవసాయం, ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలకు దాని పరిశోధన ఆధారిత విధానం ద్వారా బాదంను ప్రోత్సహిస్తుంది, వీటిలో చాలా వరకు బహుళ తరాల కుటుంబ కార్యకలాపాలు ఉన్నాయి. 1950లో స్థాపించబడింది. కాలిఫోర్నియాలోని మోడెస్టోలో స్థాపించబడింది. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా అనేది యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పర్యవేక్షణలో పెంపకందారు, అనుమతి చేసిన ఫెడరల్ మార్కెటింగ్ ఆర్డర్‌ను నిర్వహించే ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా లేదా బాదంపప్పు మరింత సమాచారం కోసం, www.almonds.in ని సందర్శించండి.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP