తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల స‌మ‌రానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌యింది. మంగళవారం నాటికి ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జనాలను కలవడం.. ఇలా తాము ప్రచారం చేసుకోవడానికి ఏ మార్గాన్ని కూడా వారు వదలడం లేదు. సరే అభ్యర్థులు ఎలా ప్రచారం చేసుకున్నప్పటికీ అంతిమంగా ప్రజలు ఓటు వేస్తేనే గెలుస్తారు. సరే అది వేరే విషయం. అయితే తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని ప‌లు సర్వే సంస్థలు చెబుతున్నాయి.

అయితే తాజాగా విడుద‌లైన స‌ర్వేల సారాంశం ప్ర‌కారం ముచ్చ‌ట‌గా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల బృందం నిర్వ‌హించిన టీజేఎఫ్‌ తాజా స‌ర్వేలో కూడా బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేప‌డుతుంద‌ని తెలిపింది. మ‌ళ్లీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డానికి ముఖ్య కార‌ణాలను విశ్లేషించింది టీజేఎఫ్‌కు చెందిన‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల బృందం.

ఈ మేర‌కు పదేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్‌కు ప్ల‌స్ పాయింట్‌గా చెప్పుకోవ‌చ్చు. హైదరాబాద్ నగరాన్ని కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయ‌డం కూడా బీఆర్ఎస్‌కు అనుకూల అంశంగా చెప్పుకోవ‌చ్చు. పార్టీ అధినేత కేసీఆర్ పాలననే మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఉద్య‌మ‌నాయ‌కుడిగా ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక‌మైన అభిమానం ఇందుకు కార‌ణం. తెలంగాణ సాధించిన పార్టీగా గుర్తింపు ఉండ‌టం కూడా బీఆర్ఎస్‌కు అనుకూలించే అంశం. వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా మ‌రో అనుకూల‌ అంశం. పరిశ్రమల ఏర్పాటు, 24 గంటల కరెంట్ సరఫరా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వరుస పర్యటనలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వటం, పెండింగ్ ప్రాజెక్టు పనులపై దృష్టిపెట్టడం, ప్రచారంలో అందరికంటే ముందు ఉండటంతో పాటు డిజిటల్ క్యాంపెయినింగ్ బాగా చేయటం వంటి అంశాల‌న్నీ కూడా బీఆర్ఎస్ గెలుపుకు దోహ‌దం చేస్తాయ‌ని టీజేఎఫ్‌ బృందం తెలిపింది.

 

 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *