గాజువాక, డిసెంబర్ 13, 2023: వస్త్ర ప్రియుల మనస్సు దోచే సరికొత్త షాపింగ్ మాల్ ‘సౌత్ షాపింగ్ మాల్’ ను కొత్త గాజువాకలో సినీ నటి సురభి బుధవారం ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. క్యాష్ కౌంటర్ ను తిప్పల ప్రణీతా నితేష్ ఓపెన్ చేశారు. హను ఫిలిమ్ ఫ్యాక్టరీ ఈ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినీ నటి సురభి మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందజేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొనాలని పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్ మరెన్నో బ్రాంచ్ లతో ముందుకు సాగాలని అభిలషించారు. విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే పండగ సీజన్‌లో వినియోగదారుల మనస్సును దోచే విస్తృత కలెక్షన్లతో ముందుకు రావాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ సౌత్ షాపింగ్ మాల్ ను పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ఏర్పాటు చేయడం సంతోషించ తగ్గ విషయమన్నారు. అత్యంత సరసమైన ధరలకు వస్త్రాలను అందించి వినియోగదారుల అభిమానాన్ని చూరగొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, పల్లా శ్రీనివాసరావు, నరసింహ పాత్రుడు, వురుకూటి చందు, ఏజే స్టాలిన్, స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఎస్ఎండీ గౌష్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, క్లాత్, మర్చంట్ అసోసియేషన్ మెంబర్ ఆర్ సుబ్బారావు, బలిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.