▪️ నటుడు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం
▪️ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావల శ్యామల
▪️ రూ. 25,000 చెక్కును అందించిన కాదంబరి కిరణ్
▪️ దశాబ్దం దాటిన నిర్విరామంగా కొనసాగుతున్న మనంసైతం సేవలు
▪️ చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా..మనంసైతం
ప్రతీ కన్నీటి బొట్టును తుడిచే ధైర్యం.. ఆపద వస్తే ఆదుకునే నిలువెత్తు రూపం.. మానవత్వం పరిమళించే కాదంబరి కిరణ్ మరో దాతృత్వం.. సీనియర్ నటికి సాయం అందించిన కథనం ఇది.
హైదరాబాద్: సినీ నటుడు,‘మనం సైతం’ ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావల శ్యామలకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నాడు. సీనియర్ నటి పావల శ్యామలకు అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావల శ్యామలకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు.
అవసరార్థులను తెలుసుకొని వారి వద్దకే వెళ్లి సాయం చేయడం కాదంబరి కిరణ్ గొప్పతనం. మీడియా ద్వారా తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను తనంతట తానే వెతుకుంటు వెళ్లి స్వయంగా సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు . ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా.. ఏ ఆపద వచ్చినా.. మనం సైతం అంటూ కాదంబరి కిరణ్ ముందుకొస్తారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దంపైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS TV & APP
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews