సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెఫ్ట్‌తో తీసిన చిత్రం ‘కంచర్ల’. ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వా ల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది.
యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచామని నిర్మాత అచ్యుత రావు చెప్పారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది.కంచర్ల చలనచిత్ర టాకీపార్ట్ పూర్తి చేసుకోని పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు తెలిపారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర గాడి అడ్డా చలనచిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన హీరో కంచర్ల ఉపేంద్ర నుండి 2 వ చలనచిత్రం గా కంచర్ల రాబోతోంది. ఈ సినిమా మార్చ్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ప్రొడ్యూసర్ DR. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ.. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్ తో ఈ చిత్రం ప్రేక్షకులను అల్లరిస్తుందని, ప్రముఖ ఫైట్ మాస్టర్ పుష్ప ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ తో ఫైట్స్ ను నిర్మించాము. మార్చ్ లో విడుదల కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ… ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అలరిస్తుంది, చక్కని కధ ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని అన్నారు. ఒక ట్రెండింగ్ సినిమాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకి దర్శకత్వం: యాద్ కుమార్, DOP: గుణశేఖర్