ముంబై: ఏఎంఆర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ. మహేష్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న‌కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు వరించింది. భారత్‌లో సాంఘిక సంక్షేమ రంగంలో చేసిన ఆదర్శప్రాయమైన, స్ఫూర్తిదాయకమైన సేవకు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇండియా కే. జీ. బాలకృష్ణన్ చేతుల మీదుగా ముంబైలో హయత్ హోటల్‌లో మహేష్ రెడ్డి అవార్డును అందుకున్నారు.

ఏఎంఆర్ గ్రూప్ అధినేత ఏ మహేష్ రెడ్డి వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతి కొద్దికాలంలోనే ఉన్నత యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. మైనింగ్ వ్యాపారంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలబడ్డారు. ప్రస్తుతం 5000 మంది పని చేస్తున్న కంపెనీలో కనీసం లక్ష మంది ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సాయినాధుడిని కొలిచే భక్తుడిగా షిరిడీలోని మందిరానికి బంగారు సింహాసనాన్ని దానం చేశారు. అదేవిధంగా ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలో పలు చోట్ల దైవ మందిరాలు కట్టించారు. శ్రీశైలం, కాణిపాకం, నెల్లూరులోని రామతీర్థం, రాజరాజేశ్వర టెంపుల్, శ్రీ పృద్వేశ్వర టెంపుల్ వంటి గుడులను తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. ఆయన గతంలో సాయి ప్రేరణ ట్రస్ట్ సంబంధించి సాయి తత్వాన్ని బోధించే విధంగా చేసిన సేవలకు ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డుతో ఆయనను సత్కరించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లో చాలా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్య రామ జన్మభూమికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఏఎంఆర్ ప్రొడక్షన్స్ ద్వారా భక్తి తత్వాన్ని బోధించే విధంగా రెండు తెలుగు సినిమాలను నిర్మించారు. అదేవిధంగా ఏ మహేష్ రెడ్డి 148 కేజీల బంగారాన్ని సాయిబాబా సనాతన ట్రస్ట్ షిరిడికి విరాళంగా మహేష్ రెడ్డి అందజేశారు. మహేష్ రెడ్డి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవ‌డంతో దేశవిదేశాల నుంచి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు అందుతున్నాయి.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

 

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews


 

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *