తెలుగు సినీ ప్రేక్షకులను భావోద్వేగాలతో ముంచెత్తే మరో హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘నాన్నా మళ్లీ రావా..!’. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యప్రకాశ్ ప్రధాన పాత్రలో కనిపించగా, ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.
కథ
వెదురుగూడెంలో నివసించే బుట్టల బుట్టల వృత్తిలో జీవనం సాగించే వెంకన్న (సత్యప్రకాశ్), లక్ష్మి (ప్రభావతి) దంపతులు 30 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తారు. చివరికి లక్ష్మికి గర్భం దాలుగుతుందన్న ఆనందం వారికి కొంతకాలమే ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేతో వెంకన్నకి ఏర్పడిన గొడవల కారణంగా వారు ఊరిని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
కొత్త ఊరిలో జీవన పోరాటం మొదలైందీ దంపతులకు. కేశవ్ (రిత్విక్) గా పుట్టిన వారి కొడుకు అల్లరి చేస్తూ పెరుగుతాడు. విద్యలో ముందు ఉండాలని తండ్రి ఆశ, కానీ కొడుకు తిరుగుబాటు స్వభావం కలవాడు. కాలక్రమేణా కేశవ్ ఇంజినీరింగ్ చదువుతూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అయితే ఈ ప్రయాణంలో తన తండ్రి చేసిన త్యాగాలను గుర్తించి మెలకువ పడిన కేశవ్, కొంత సమయం గడిపేలోపే వెంకన్న ఆరోగ్య పరిస్థితి విషమించిపోతుంది. చివరికి తండ్రి కోసమే విజయాన్ని అందుకున్నా, తాను తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించలేకపోయానన్న బాధ కేశవ్‌ను వెంటాడుతూనే ఉంటుంది.
నటీనటుల ప్రతిభ
🔹 సత్యప్రకాశ్ – ఇప్పటి వరకూ ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించిన ఈ సీనియర్ నటుడు, ఈ సినిమాలో తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఆయన నటన, హావభావాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి.
🔹 రిత్విక్ – కేశవ్ పాత్రలో నటించిన రిత్విక్ లవ్ సీన్స్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా నటించాడు. తండ్రి విలువ తెలుసుకున్న క్షణంలో ఆయన బాధను సజీవంగా వ్యక్తీకరించాడు.
🔹 ప్రభావతి – తల్లి లక్ష్మి పాత్రలో ప్రభావతి సహజత్వంతో ఒదిగిపోయారు. భర్త, కొడుకు మధ్య జీవన పోరాటాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
🔹 హరీక, శిరీష, స్వాతి, జీఎంఆర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విభాగం:
సంగీతం – గోపీనాథ్ కొండా, అర్మాన్ మెరుగులు అందించిన పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. “ఆకాశం రివ్వున కరిగిందా..”, “కష్టం ఎదురైనప్పుడు ఓదార్పై..” వంటి పాటలు ప్రేక్షకుల మనసును ద్రవింపజేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
సినిమాటోగ్రఫీ – విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. కొన్ని కీలక సన్నివేశాలను ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు.
ఎడిటింగ్ – ఎడిటింగ్ పరంగా కొంత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. కొన్ని సన్నివేశాలను షార్ట్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా మారేది.
నిర్మాణ విలువలు – చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాత డా. ఉమారావు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా లోకేషన్‌లు, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.
విశ్లేషణ
ఈ చిత్రం తండ్రి త్యాగాన్ని గొప్పగా చిత్రీకరించిన భావోద్వేగ కథనం. దర్శకుడు నిర్దేష్ తండ్రి ప్రేమ, బాధ్యతను గొప్పగా చూపించగలిగారు. కథనం ఎక్కడా కదలకుండా, ఆఖరి వరకు భావోద్వేగం పండేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా చివరి సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు ‘మాతృదేవోభవ’ వంటి క్లాసిక్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. కుటుంబ విలువలను, తండ్రి త్యాగాన్ని తెలిపే ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది.
ఫైనల్ గానే చెప్పాలంటే..
తండ్రి త్యాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి చూడొచ్చు!
రేటింగ్: 3.75 / 5
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php