నమో జయం ప్రొడక్షన్స్‌ పతాకంపై నేషనల్‌ అవార్డు విన్నర్‌ నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). జయంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్‌ స్కూల్‌ టీచర్‌గా నటించటం విశేషం. దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను టీచర్స్‌ డే సందర్భంగా జాతీయ అవార్డు పురస్కారం అందుకున్న టీచర్‌ మారం పవిత్ర గారి చేతుల మీదుగా ‘ జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయంత్‌ మాట్లాడుతూ– ‘ ఇదో కొత్త తరహ చిత్రం. మనం రోజు స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించి మా సినిమాలో చెప్పటం జరిగింది’’ అన్నారు. దర్శకుడు నవీన్‌ దేశబోయిన మాట్లాడుతూ– ‘నేను ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నా గత చిత్రం ‘లతా భగవాన్‌ ఖరే’, చిత్రానికి దేశవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చాయి. వాటితో పాటు ఫిలింఫేర్, నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాను. జయంత్‌ను హీరోగా పెట్టి నేను చేసిన ‘జయంత్‌ అండ్‌ జింగోపెన్‌’ మలయాళ సినిమా ‘ఫిలిప్‌ అండ్‌ ది మంకీ పెన్‌’ అనే చిత్రం రీమేక్‌. మలయాళంలో ఈ చిత్రం 111 రోజలు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండటంతో అంత పెద్ద విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.

సత్యం రాజేష్‌ మాట్లాడుతూ–‘‘ టీచర్స్‌ డే రోజున నేను టీచర్‌గా నటించిన సినిమా జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుని మారం పవిత్ర గారి చేతుల మీదుగా ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ–‘‘ నా ఉద్ధేశ్యంలో స్కూలే దేవాలయం. టీచర్సే దేవుళ్లు అని నమ్ముతాను. అందుకే మా సినిమా ఓపెనింగ్‌ ఇక్కడే చేశాం. మా సినిమా ఫస్ట్‌లుక్‌ ప్రమోషన్‌ని ఇక్కడినుండే ప్రారంభిస్తున్నాం. ఇది నాకు నా భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణం ’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం– మోహిత్‌ కులకర్ణి, ఎడిటర్‌– నందమూరి హరి తారక రామారావు, కెమెరా– ఆండ్రూబాబు, ట్యూన్స్‌ అండ్‌ లిరిక్స్‌– మాటలు– ప్రవీణ్‌ బొలిశెట్టి, ఆర్ట్‌ డైరెక్టర్‌– నాని, ఆశిష్‌ గాందీ, కాశీ విశ్వనా«ద్, తనికెళ్ల భరణి, మానస రాధాకృష్ణన్‌ తదితులు నటించారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *