ఎండాకాలం సాధారణంగానే ఏదీ తినాలని అనిపించదు. ఇక నూనెతో చేసిన పదార్థాలు తీసుకుంటే ఆకలి ఇంకా తగ్గిపోతుంది. ఎండలు బాగా ఉన్నంత కాలం వంటల్లో నూనెలు తగ్గించాలి. వేపుళ్లు మానేయాలి. నూనెలతో చేసిన వంటలు మోతాదు మించితే.. జీర్ణాశయంపై ఒత్తిడి పడుతుంది. వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు ఇబ్బంది పెడతాయి. బయటి వాతావరణంలో చాలా వేడి ఉంటుంది కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడు కోవాలంటే ఎక్కువగా నీరు, లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. పళ్ల రసాలను చిక్కగా చేసుకుని ఆరగించడం ఆరోగ్యకరం. బొప్పాయి, మామిడి గుజ్జు, రాగి జావ ఈ సీజన్‌లో తీసుకోవచ్చు. ఇవి శక్తితోపాటు శరీరానికి కావాల్సిన నీటిని ఇస్తాయి. ఆకలి పెంచుతాయి.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్