▪️ ‘ఐబీఏ – ఇండియా డే పేరేడ్’లో పాల్గొన్న తెలుగు సంఘం ‘మాటా’
▪️ భారతమాత, స్వాత్రంత్యయోధుల వేషాధారణలతో ‘మాటా’ సందడి
▪️ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపిన MATA వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్(IBA) నిర్వహణలో జరిగిన ఇండియా డే పరేడ్‌లో తెలుగు సంఘం ‘మన అమెరికన్ తెలుగు అసోషియేషన్’ (MATA) పాల్గొని పలు కార్యక్రమాలు చేపట్టింది. 77వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూజెర్సీ ఎడిషన్ ప్రాంతంలోని ఓక్‌ట్రీ రోడ్‌లో ఇండియా డే పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం, ప్రవాస భారతీయులు జాతీయ జెండాలను చేతబట్టి భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రముఖ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పాల్గొన్నారు.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు భారతమాత, స్వాత్రంత్య యోధుల వేషాధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆటపాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డప్పు, వాయిద్యాలతో, ఆట పాటలతో పెరేడ్‌లో పార్టిసిపేట్ చేసి తమ దేశభక్తి ని చాటుకున్నారు. పెరేడ్ కు వచ్చిన ప్రవాస భారతీయులు ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్‌లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతమంతా మువ్వన్నెల జెండా రెపరెపలతో సందడిగా మారింది.
అమెరికాలో జరిగిన ఈ భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న తొలి తెలుగు సంఘం ‘మన అమెరికన్ తెలుగు అసోషియేషన్’ (MATA). ఈ సందర్భంగా ‘మాటా’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని ప్రవాసీయులకు, భారతీయులందరికీ 77వ భారత స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రవాసీయులు మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. ‘మాటా’ యూఎస్ఏ – ‘మాటా’ ఇండియా.. ఇలా రెండు చోట్ల తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో ‘మాటా’ ఈడీ కిరణ్ దుద్దగి,(ED) కోశాధికారి గంగాధర్ వుప్పల(Treasurer), ఐవీపీ శ్రీధర్ గుడాల(IVP), ఆర్‌వీపీ మల్లిక్ రెడ్డి, ఎస్సీ రంగ మాడిశెట్టి, ఆర్‌వీపీ కృష్ణ సిద్ధాడ.. తదితరులు పాల్గొన్నారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I