హైదరాబాద్ : ఓ వైపు ప్రభుత్వ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ, మరో వైపు సమాజానికి సేవ చేస్తున్న గాయక్వాడ్ తులసీ మాంగ్ కు 2024 తెలంగాణ ఐకాన్ అవార్డ్ వరించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సౌజన్యంతో తెలంగాణ వాయిస్ స్టూడియో, తెలంగాణ థియేటర్, మీడియా రిపేరిటరీ ఆధ్వర్యంలో బిగ్ రీల్స్ సినిమా వార పత్రిక 25 వ సంచిక విడుదల సందర్బంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖా డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్‌కి తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ 2024 పురస్కారాన్ని ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు.

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత పరిపాలన కేంద్ర కార్యాలయం సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ‘మాంగ్ సమాజ్ తెలంగాణ’ సంఘాన్ని స్థాపించి ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు TSCSTEHHA అనే హెల్పింగ్ హాండ్స్ చారిటీని ఏర్పాటుచేసి ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆపన్న హస్తం అందిస్తూ, పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్టులో సామాజిక సేవ చేస్తున్న గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ సేవలను పలువురు కొనియాడారు. తన సామాజిక సేవలను గుర్తించినందుకు తెలంగాణ థియేటర్, మీడియా రిపేరిటరీ అధ్యక్షులు బి. రమేష్ కిషన్ గౌడ్‌కు ఈ సందర్భంగా గాయక్వాడ్ తులసీదాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనకు ఉత్సాహన్ని ఇచ్చిందని, తన సేవ బాధ్య‌త‌లను మరింతగా పెంచిందని అన్నారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *