దమ్మాం, (సౌదీ అరేబియా): సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసులు దమ్మాంలో శుక్రవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆహ్లాదభరితంగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రవాసులతో పాటు, ఇతర రాష్ట్రాల భారతీయులు, బహ్రెయిన్, కువైట్ నుండి వచ్చిన అతిథులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సంధ్య పర్యవేక్షణలో జరిగిన కోలాటం ప్రదర్శన. డా. అనురాధ, జయశ్రీ, సౌజన్య, రాధ, నవ్య, రజిని, భవాని, జాన్హవి, లక్ష్మి, పద్మ ప్రియ, స్వాతీ దుర్గ, కోమతి దివాకర్, రుచిత, విజయ, పార్కవి, జ్యోతి, నాగ జ్యోతి, ప్రీతి, అంజలి, వాసంతి లతో కూడిన ఈ బృందం దాదాపు మూడు నెలల శిక్షణతో ప్రేక్షకులను అలరించింది. వారి కృషి ఫలితంగా కోలాటం ప్రదర్శన కనుల విందుగా నిలిచింది.
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో, అధ్యక్షుడు తేజ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్, రంగోలి పోటీలు, సంప్రదాయ వంటకాల విందు నిర్వహించబడింది.
సంస్థా వ్యవస్థాపకుడు ఎస్. మల్లేశ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దాదాపు 1,500 మంది పాల్గొనడం విశేషమని, ఇది తెలుగువారి ఏకతను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. వలస కార్మిక సంక్షేమ ఫోరం అధ్యక్షుడు భీమ్ రెడ్డి మంద ఈ కార్యక్రమం సమాజానికి సహాయంగా నిలిచే వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి సంబరాలు సౌదీ అరేబియాలో తెలుగు వారిపై వారి సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని మరింతగా అందంగా, ఆకర్షణీయంగా, కన్నుల పండువగా ప్రదర్శించారు.