▪️ షూటింగ్ పూర్తి – విడుదలకు ముస్తాబు
▪️ హీరో అర్జున్ యాదవ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌
▪️ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో పాటలు

హైదరాబాద్: ప్రేమ, భావోద్వేగాలు, మధుర జ్ఞాపకాల కలయికగా రూపొందుతున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వి. అర్జున్ యాదవ్, అదితి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మిస్తుండగా, హరికృష్ణ పామంజి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. సంగీత దర్శకుడు అర్మాన్ మెరుగు అందించిన మెలోడీయస్ ట్యూన్స్, హృదయాలను హత్తుకునే సాహిత్యం సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రం ద్వారా పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఓ భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుందని చిత్రబృందం చెబుతోంది. తొలి చిత్రమే అయినప్పటికీ అర్జున్ యాదవ్ తన సహజ నటనతో, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. లవర్ బాయ్‌గా, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆయన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

హీరోయిన్ అదితితో అర్జున్ యాదవ్ కెమిస్ట్రీ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రేమలోని మాధుర్యాన్ని, విరహంలోని బాధను, జీవితంలోని అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు హరికృష్ణ పామంజి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను క్లైమాక్స్ వరకు కట్టిపడేస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

సినిమాటోగ్రాఫర్ తేజ.ఎ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, రిచ్ విజువల్స్‌తో ఆవిష్కరించగా, భావోద్వేగాలకు అద్దం పట్టేలా చిత్రాన్ని మలిచారు. ప్రేమను కొత్త కోణంలో చూపించే ఈ అందమైన ప్రేమకథ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.

నటీనటులు:

పి.వి. అర్జున్ యాదవ్, అదితి తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: హరికృష్ణ పామంజి
నిర్మాత: పి.వి. నరసింహ యాదవ్
బ్యానర్: శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్
సంగీతం: అర్మాన్ మెరుగు
ఎడిటర్: అలతోర్ రాజేష్
సినిమాటోగ్రఫీ (DOP): తేజ .ఎ
ఆడియో లేబుల్: మ్యాంగో మ్యూజిక్
పీఆర్ఓ: కృష్ణ ప్రసాద్ (కేపీ)

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *