హైదరాబాద్ (మీడియా బాస్ నెట్‌వర్క్): జూబ్లీహిల్స్, ఫిలింనగర్ సైట్-2 లో అచ్చం తిరుమల తరహాలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయము ను నూతనం గా నిర్మించారు. హైదరాబాద్ లో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ ఆలయము హైదరాబాద్ కు తలమానికంగా నిలిచింది. ఈ ఆలయము అచ్చం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయము పొలి ఉంది. “మినీ తిరుపతి దేవస్థానం గా పిలవబడుతుంది. అంతేకాక, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయము లో జరిగే ఆర్జిత సేవలు అన్ని ఇక్కడ కూడా జరుగుతాయి. రాజధానికి తలమానికంగా నిలవబోతున్న ఈ శ్రీవారి ఆలయంను మూడున్నర ఎకరాల విస్థిర్ణంలో భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా అద్భుత రాతి కట్టడంతో ఈ ఆధ్యాత్మిక ధామంను నిర్మించారు. తితిదే ఇది వరకు హిమయత్‌నగర్‌లో శ్రీవారి ఆలయంను నిర్మించగా ఇది రెండో ఆలయం.
ఆలయానికి ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్ నుంచి 47సి, 47ఎఫ్, 47ఎల్, 47వై, 47వైజీ, దిల్‌సుఖ్‌నగర్ బస్సు స్టేషన్ నుంచి 90డి/47వై, కోఠి బస్టాప్ నుంచి 127 ఎఫ్, సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 47వై/జి నంబర్ల ఆర్టీసీ బస్సులో ఫిలింనగర్ అపోలో హాస్పిటల్ బస్టాప్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి నడకతో చేరుకోవచ్చు.
- కూకట్‌పల్లి నుంచి వచ్చే వారు అమీర్‌పేట, పంజాగుట్ట చౌరస్తాల నుంచి ఫిలింనగర్‌కు రాకపోకలు కొనసాగించే ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో సులువుగా చేరుకోవచ్చు.
- ఈసీఐఎల్ బస్టాప్ నుంచి 16హెచ్/47ఎల్, 17హెచ్‌ఎన్/47ఎల్ నంబర్ల బస్సుల నుంచి ఫిలింనగర్‌కు రావచ్చు. హైటెక్‌సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల వాసులు 127 ఆర్టీసీ బస్సుల్లో ఫిలింనగర్‌కు అరగంట వ్యవధిలోనే చేరుకోవచ్చు.
- మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వారు పంజాగుట్ట చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో, లేదా ఆర్టీసీ బస్సుల్లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు అక్కడి నుంచి ఫిలింనగర్ బస్టాప్‌కు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కాలినడకన ఐదు నిమిషాల వ్యవధిలో అపోలో ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.