తెలుగు సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఖ్యాతి, గౌర‌వం తీసుకొచ్చిన మూవీ ‘బాహుబలి’. ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రికార్డులు సృష్టించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ‘బాహుబలి’కి కొనసాగింపుగా‘బాహుబలి-3’ రానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇటీవల ప్రభాస్ స్పందించాడు. పార్ట్-3 గురించి త‌న‌కు కూడా తెలియద‌ని, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. అంటూ చిన్న క్లూ అయితే ఇచ్చాడు.

తాజాగా ‘త్రిపులార్’ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి ఓ ఛానల్‌కు ఇచ్చి న ఇంటర్వ్యూలో బాహుబ‌లి-3 కి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ‘‘ఇప్పటికే ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చూపించారు. మీ నుంచి ‘బాహుబలి-3’ రానుందని భావించవచ్చా ?’’ అని జ‌క్క‌న్న‌ను అడగ్గా.. ‘‘తప్పకుండా భావించొచ్చు అని చెప్పాడు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నామ‌ని తెలిపాడు. దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నామ‌న్నారు. త‌మ‌ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని తెలిపాడు జ‌క్క‌న్న‌. దీన్ని చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు అని.. ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుంది’’ అని రాజమౌళి ప్ర‌క‌టించారు. రాజమౌళి మాటతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొద‌లైంది. ‘బాహుబలి-3’ కోసం వెయిటింగ్.. అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘త్రిపులార్’ తర్వాత త‌ను చేయబోయే ప్రాజెక్ట్ సూప‌ర్ స్టార్ మహేశ్ బాబుతోనే ఉంటుందని.. దానికి సంబంధించి వర్క్ జరుగుతోంద‌న్నారు. కాకపోతే ప్రస్తుతం త‌న‌ దృష్టి అంతా ‘త్రిపులార్’ పైనే ఉంద‌న్నారు. ఈ సినిమా విడుదలయ్యాక.. కాస్త ప్రశాంతంగా మహేశ్ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *