బంగారం విలువైన లోహం.. భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు ఆస్తిగా భావించే ఈ బంగారం ఇప్పుడు పెట్టుబడి గా కూడా మారింది. శుభకార్యా లు, పండుగల సమయంలో భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృ తీయ, ధనత్రయోదశి వంటి శుభదినాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. త్వరలో వివాహాల సీజన్ రాబోతోంది. ఆ సమయంలో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఒకవేళ మీరు కూడా భౌతిక బంగారాన్ని కాయిన్లు, బార్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు వహించాల్సిందే.

బంగారాన్ని కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దాని ధర. పసిడి ధర
ఎప్పుడూ స్థిరంగా ఉం డదు. స్వల్ప కాలంలోనే చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. వివిధ అంశాల ప్ర‌భావంతో బంగారం ధర మారుతుంటుంది. దేశమంతటా కూడా ఒకేలా ఉండదు. ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండొచ్చు. కొనుగోలు చేసే ముందు బంగారం ధరను ఒకట్రెండు షాపుల్లో ఆరా తీయాలి. విశ్వసనీయ వెబ్‌సైట్లలో కూడా రేట్లను చూడ‌వ‌చ్చు. అలాగే బంగారం కొనుగోలు చేసేటప్పు డు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని క్వాలిటీ. బంగారం స్వ చ్ఛ తను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ, ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యా రెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇతర
లోహాలను బంగారంతో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభరణాల స్వచ్ఛత 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యా రెట్లను తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్ర‌భుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.. బీఐఎస్ ను ఏర్పాటు చేసిం ది. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం బీఐఎస్ హాల్ మార్క్‌ను కలిగి ఉంటే మంచిది. ఒకవేళ మీకు బంగారు హాల్మార్క్ గురిం చి ఫిర్యా దులు ఉంటే బీఐఎస్‌ను నేరుగా సంప్రదించొచ్చు. దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా తయారీ రుసుములు మారుతూ ఉంటుంది. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వరకు తయారీ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంత తయారీ రుసుముగాను, కొంత తరుగు రూపంలో మీ నుంచి వసూలు చేస్తారు.

బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు స్థానిక స్వర్ణకారుడి వద్ద గానీ లేదా బ్రాండెడ్ ఆభరణాల షోరూమ్‌లో గానీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇందుకు వెబ్‌సైట్స్, ఎంఎంటీసీ వంటి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు గోల్డ్ కాయిన్
కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించొచ్చు. చాలా బ్యాంకులు వేరు వేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, ప్రాఫిట్ మార్జిన్, పన్ను వంటివి వర్తిస్తాయి. తిరిగి విక్రయించేటప్పుడు మాత్రం ఇవేమీ తిరిగిరావు. పైగా వేస్టేజ్ రూపంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. కొన్ని షోరూమ్లు సందర్భానుసారంగా వివిధ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ ఆఫర్లను ఒకసారి పరిశీలించండి. కొంతమంది దుకాణదారులు నెలవారీ డిపాజిట్ పథకాలను అందిస్తుంటారు. డిపాజిట్ కాలం పూర్తయ్యాక తయారీ ఛార్జీలు, తరుగు లేకుండా బంగారం కొనుగోలు చేసే వీలు కల్పిస్తారు. కొంత మంది బంగారాన్ని నిల్వ చేసేందుకు, మరికొంత మంది పెట్టుబడి సాధనాలుగా కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబడుల కోసం కొనుగోలు చేసేవారు.. తమ మొత్తం పోర్ట్‌పోలియోలో 10 నుంచి 15 శాతం వరకు బంగారంలో మదుపు చేయొచ్చు . గోల్డ్ కాయిన్లు, ఆభరణాల రూపంలో కాకుండా పసిడి పథకాలు, గోల్డ్ ఈటీఎఫ్‌ ద్వారా డిజిటల్‌గా బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. భౌతిక బంగారం, నిల్వ, నిర్వహణ, భద్రత వంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. సార్వభౌమ పసిడి పథకాల్లో కాలపరిమితి వరకు కొనసాగిస్తే పన్ను
ప్రయోజనాలను పొందొచ్చు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *