మ‌న‌సుంటే మార్గం ఉంటుంది
చిన్నారుల విజ్ఞానం కోసం ఓ య‌జ్ఞం

తన కలలవైపు నమ్మకంతో ఎవరు అడుగు వేస్తారో, తాను ఊహించుకున్న విజయాన్ని అనుభవించడానికి ఎవరు ప్రయత్నిస్తారో వారు అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిస్తారు. దీనికి ప‌ర్‌పెక్ట్ ఎగ్జాంఫుల్ ఉడతనేని హిమబిందు. మ‌న‌సుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తోంది. ఆమె పాఠాలు ప్రపంచానికి వినిపిస్తున్నాయి.. త‌ను అనుకున్న రంగంలో సాధించాల‌ని త‌ప‌న‌తో అన్‌లైన్ విద్య‌రంగాన్ని ఓ య‌జ్ఞంలా నిర్వ‌హిస్తోంది.

ఉడతనేని హిమబిందు మామూలు గ్యాడ్యుయేట్‌. పెళ్లయింది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పెళ్లై పదేళ్లయినా.. ఓ బిడ్డకు తల్లయినా.. ఆమెలో తాను ఏదో చేయాలన్న తపన. తనను తాను నిరూపించుకోవాలన్న ఉత్సుకత. తనకున్న నాలెడ్జ్‌ని కొందరికైనా పంచాలన్న ఉత్సాహం.. ఆమెను నిద్రపోనివ్వలేదు. దీనికోసం ఆమె తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండాల్సి వచ్చినా .. అమెరికాలో కొన్నాళ్లు ఉన్నా.. హైదరాబాద్‌ వచ్చినా.. చివరకు ఇప్పుడు కోవిడ్‌ ఎఫెక్ట్‌తో వర్క్‌ఫ్రం హోం పేరిట పల్లెటూరికి చేరినా.. ఆమె మాత్రం తాను అనుకున్న దారిలో ప్రయాణిస్తూనే ఉన్నారు. దీనికోసం ఆమె గతంలోనే ప్రారంభించిన ‘బిజీ బీ’ లెర్నింగ్‌ స్కూల్‌ను ఆన్‌లైన్‌ దారికి మళ్లించారు. ఈ బిజీ బీ స్థాపనకు ఆమె గతంలో ప్రయాణించిన మార్గం.. అంటే ఢిల్లీ జీవితం.. హైదరాబాద్‌.. అమెరికాలో బోధనా రీతులను ఆమె స్టడీ చేశారు. స్నేహితురాలు శిరీషతో కలసి ప్రారంభించిన ‘బిజీ బీ’ కి బాలారిష్టాలు ఎదురైనా ఆమె వెరవలేదు. ఆన్‌లైన్‌ వేదికగా తన పనికి మరింత పదును పెట్టారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని విద్యార్థులకు ఆమె ఆన్‌లైన్‌లోనే బోధన చేస్తున్నారు. ఇలా బిజీబి వేదికగా ఆమె సాధారణ అకడమిక్‌ సబ్జెక్ట్‌లైన ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమెస్ట్రీ, బయాలజీ, వేదిక్‌ మ్యాథ్స్‌, క్యూబిక్‌ మ్యాథ్స్‌, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఇంకా సంగీతం, వాద్యాలు, నాట్యం, యోగా.. ఇలా ఒకటేమిటి దాదాపు ముప్పై ఐదు ప్రత్యేక విషయాలలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి క్లాసు 45 నిమిషాల నిడివి ఉండేలా ప్లాన్‌ చేసుకుని విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలను అందిస్తున్నారు. ఇలా ముప్పై ఐదు మంది ట్యూటర్లకు ఈ కరోనా కష్ట కాలంలో ఉపాధిని సైతం చూపిస్తున్నారు.

ఉడతనేని హిమబిందు

పెళ్లయిన కొత్తలో అంటే సరిగ్గా పదేళ్ల క్రితం ఢిల్లీలో ఉండగా తన భర్త నిత్యం సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి వెళ్లిపోయేవాడు. ఆమె మాత్రం ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ ఫీలవుతుండేది. ఏంచేయాలి..? ఇదేనా జీవితం అన్న ప్రశ్న పదేపదే ఆమె మైండ్‌లో మారుమోగిపోయేది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్‌. బాబు పుట్టాడు. అయినా ఆమె వెనుదిరగలేదు. ఏదో ఒకటి చేయాలన్న ఆమె సంకల్పం నడిపించింది. పీపీటీసీ శిక్షణ తీసుకుని దగ్గరిలోని ఓ స్కూల్‌లో నర్సరీ టీచర్‌గా చేరారు. ఇంకా ఏదైనా చేయాలన్న తలంపు తొలిచేస్తుండగా.. ఇంట్లోనే ఉంటూ రేడియో జాకీగా చేయొచ్చన్న స్నేహితురాలి సలహా మేరకు దాన్లోనూ ట్రైనింగ్‌ తీసుకుంది. తెలుగువన్‌ రేడియోలో జాకీగా చేస్తూ మహానటి సావిత్రి కుమార్తె ఇంటర్వ్యూ చేసి ఆహా అనిపించుకున్నారు. ఈ సందర్భంలో ఈ ఇంటర్వ్యూతో బాగా ఇంప్రెస్‌ అయిన సావిత్రి అజ్ఝాత అభిమాని ఒకరు హిమబిందుకు వంద డాలర్ల చెక్కును గిఫ్ట్‌గా పంపారు. దీంతో ఇలా లభించిన ప్రోత్సాహంతో ఆమె మరింత ఉత్సాహంగా ముందుకెళ్లారు. ఇలా రేడియోజాకీగా చేస్తూనే.. బిజీ బీ ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తూనే.. ఆమె మరింత ముందుకెళ్లి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను చేసే యూట్యూబ్‌ ప్రోగ్రాములు ముందుగా తన కుటుంబ సభ్యులకు చూపి.. అవసరమైన సూచలను తీసుకుని మార్పులు చేర్పులు చేస్తూ.. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ రంగంలోనూ దూసుకెళ్తున్నారు. అస్సలు ఈ ఉడుతనేని హిమబిందు ఉత్సాహానికి.. ఆమె ప్రతి రంగంలోనూ దూసుకెళ్లడానికి ఓ ఇంట్రస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది..

సాధారణ దిగువ మధ్య తరగతి నుంచి ఎదిగిన హిమబిందు చదువు కోసం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో.. నెలనెలా ఆమె తన తండ్రి పంపే డబ్బు సరిపోక ఏదో ఒకలా తాను కూడా సంపాదించాలన్న ఆలోచన చేశారు. 2006లోని ముచ్చట ఇది. అప్పట్లో విద్యానగర్‌లో తన అక్కతో కలసి ఉండే హిమబిందు తనకు దగ్గరిలోని ఐఐటీ ఫౌండేషన్‌ స్కూల్‌లో ప్రతి ఆదివారం ఆరో తరగతి పిల్లలకు పెట్టే పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా పనిచేసేవారు. దీంతో ఒక్క రోజే రూ.200 సంపాదించడంతో ఆమె.. తాను సైతం ఏదో ఒకటి చేయాలన్న తలంపు.. తనను తాను నిరూపించుకోవాలన్న కసితో పనిచేశారు. తన కుటుంబలో అందరూ ఇంజినీర్లు అయినప్పటికీ.. తాను మాత్రం సాధారణ డిగ్రీ చదివినా.. ఎక్కడా న్యూనతకు తావివ్వకుండా తన సహజమైన ప్రతిభతో రాణిస్తున్నారు.

HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *