హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్‌ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్‌ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్‌ సేన్‌పై అరుణ్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌లో(హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్‌ హీరో విశ్వక్‌ సేన్‌, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపుర‌నేని చిట్టితో డిబెట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలా ప్రాంక్‌ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్‌ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్‌. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్‌ పర్సన్‌, పాగల్‌ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్‌ యాంకర్‌పై ఫైర్‌ అయ్యాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయానని మీరు స్టేట్‌మెంట్‌ పాస్‌ చేయడం కరెక్ట్‌ కాదు. అలా ఏ డాక్టర్‌ చెప్పాడో అతడి నెంబర్‌ ఇవ్వండి నేను మట్లాడుతాను. నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హ‌క్కు మీకు లేదు’ అన్నాడు.

అలాగే ‘నాకు పాగ‌ల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై ప‌రువు న‌ష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయ‌ను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెష‌న్ ప‌ర్స‌న్‌, పాగ‌ల్ శీను అని అన‌డం స‌రికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో యాంకర్‌ విశ్వక్‌ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోమ్మంటూ గ‌ట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్‌ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్‌.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *