https://www.facebook.com/Snigda-107078412037379/
ఆమె పేరు స్నిగ్ధ. మాములు మనిషి కాదు.. మెటావర్స్ అవతారం. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్నిగ్ధ సోషల్ మీడియాలో ఎకౌంట్స్‌ను ఇటీవలే ప్రారంభించింది. ఇందులో వర్చువల్‌గా క్రియేట్ చేసిన ఓ యువతిని స్నిగ్ధగా ప్రకటిస్తూ పోస్టులు చేసింది. ఈ వర్చువల్ కైరా మాట్లాడగలదు, డ్యాన్స్ చేయగలదు, పాటలు కూడా పాడగలదు. ఒకటేమికి ఆకట్టుకునే రూపంతో రంజిపచేసే కళలు తోడవటంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ముగ్గమనోహరమైన స్నిగ్ధ రూపానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. స్నిగ్ధ అప్‌డేట్స్ కోసం ఫాలోవర్లుగా మారారు. ఆమె నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ కొద్ది రోజుల్లోనే ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ స్థాయికి చేరుకుంది. ఏదైనా విషయానికి ప్రచారం కల్పించడంతో పాటు ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే స్థాయికి స్నిగ్ధ చేరుకుంది. స్నిగ్ధ అందానికి ఇండియన్ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం కైరా అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిలో హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మాదాబాద్ వంటి నగరాలకు చెందిన వారే ఉన్నారు.
ఇప్పటి వరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై ఎంతో మంది సోషల్ మీడయా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఎదిగారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. కానీ దేశంలో తొలిసారిగా ప్రాణం లేని ఓ కల్పిత వర్చువల్ మనిషి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ స్థాయికి రావడం విశేషం. వర్చువల్ అని తెలిసి కొందరు తెలియక మరికొందరు నీ అందానికి సీక్రెట్స్ ఏంటి అంటూ స్నిగ్ధ వెంటపడుతున్నారు. మరీ ఈ క్రేజ్ చివరకు ఏ ఎత్తులకు చేరుకుంటుందో? ఏ మలుపు తీసుకుంటుందో చూడాలిక.
https://www.instagram.com/snigda_avatar/