విశాఖపట్నం: అభాగ్యుల ఆశాదీపం, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ‘భీశెట్టి రామారావు’ ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు హనూస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ (Hanus film factory) సీఈవో భీశెట్టి హనుమంతురావు తెలిపారు. రైతు రాజు రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత భీశెట్టి రామారావు జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభాగ్యుల ఆశాదీపం, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధిగా మా తండ్రి భీశెట్టి రామారావు పేరుగాంచారన్నారు. ఆయన 200 పైగా పేద జంటలకు వివాహాలు చేశారన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల పక్షపాతిగా ఉండేవారన్నారు. ఆయన ఆశయాల సాధించేందుకు కృత నిశ్చయంతో ఉన్నానని తెలిపారు. హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీ కోఆర్టినేటర్ గా ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో ఉన్నానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఈవెంట్స్ చేశానని, వైజాగ్లో 80 శాతం షాప్స్ ఓపెనింగ్స్ హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా చేశానన్నారు. సైమా, ఫిలిమ్ ఫేర్, మా టీవీ, సీసీసీ, సీసీఎల్, టీఎస్ఆర్ ఆల్ ఫంక్షన్స్ బర్త్డే, అవార్డు ఫంక్షన్స్, విశాఖ ఉత్సవాలు, 31ఫస్ట్ లైవ్ షోష్స్ ఇప్పటి వరకు చేశామన్నారు. ఆల్ షోరూమ్ ఓపెనింగ్స్, సీనీ షూటింగ్స్ ఆల్ ప్లాట్‌ఫారమ్స్ సంబంధించిన ఈవెంట్స్ హనూస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ చేసిందన్నారు. ప్రో కబడ్డీ కూడా ఆర్గనైజ్ చేశామన్నారు. ఎన్ఆర్ఐల సహకారంతో త్వరలోనే సరికొత్త కథాంశంతో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31 నైట్, సంక్రాంతి ఈవెంట్, దసరా ఈవెంట్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. డ్రీమ్ ప్రాజెక్టు అయిన సినిమా నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.
అఖండా సినిమా ఫేమ్ కీర్తనా వర్మ మాట్లాడుతూ.. భీశెట్టి రామారావు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చానన్నారు. ఆయన జీవితం ప్రజా సేవకు అంకితం చేశారని తెలియగానే ఏదో ఆనందం ఉందని, తండ్రి ఆశయాలను హను కొనసాగిస్తానని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా మాట్లాడుతూ.. రామారావు జయంతి సందర్భంగా హను కూడా సమాజ సేవలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని చెప్పడం సంతోషాన్నిస్తుందన్నారు. తండ్రి బాటలో నడిచి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు.