ఒక అంద‌మైన ప‌ల్లెటూరు నేప‌థ్యంలో ఒక మంచి క‌థ ఉంటే సూప‌ర్ హిట్ చేస్తారు ప్రేక్ష‌కులు. అదే కోవలో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘లంబసింగి’. ‘బిగ్ బాస్’ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మించారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు నిర్మించిన ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకుడు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ ఈ చిత్రం తాజాగా (మార్చి 15)న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
ఈ సినిమా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించాడు ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి సమయం అని భావించి హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు హరితకి తన ప్రేమని చెబితే ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు.. ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌:
దివిని ఎక్కువగా గ్లామర్ కోసమే అన్నట్టు దర్శకులు వాడుతూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. హరిత అనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్ లు కూడా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీలా మిగిలిన దర్శకులు కూడా దివిలో ఉన్న నటిని గమనిస్తే.. కచ్చితంగా ఆమె సినీ కెరీర్ మరోలా ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని తెరకెక్కించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

విశ్లేషణ:
‘లంబసింగి’ ఒక‌ అంద‌మైన‌ కథ. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న స‌బ్జెక్టు బాగుంది. ఫస్టాఫ్‌లో కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ఇంకా సూప‌ర్. ఇక సెకండాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని కూడా పర్‌ఫెక్టుగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు. ‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరించే సినిమా. 2 గంటల పాటు మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో క‌లిసి థియేటర్లలో చూడాల్సిన సినిమా అని నిస్సాందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్ : 3.5 / 5

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

 

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *