చిత్రం: ‘ఎస్‌ 99’
విడుద‌ల‌: మార్చి 1, 2024
బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో
నటీనటులు : సి. జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు.
ప్రొడక్షన్‌ డిజైనర్‌: ప్రణతి,
ఎడిటర్‌: సి. యతీష్‌,
డీఓపీ: శ్రీనివాస్‌,
లిరిక్స్‌: రాంబాబు గోసల,
స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి,
సంగీతం: విజయ్‌ కూరాకుల,
పీఆర్వో: బి. వీరబాబు,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌.
నిర్మాతలు: యతీష్, నందిని
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్‌

ఎప్పుడూ అదే ఫార్మెట్ కాకుండా కాస్త కొత్త‌గా చూపిస్తే ఆడియ‌న్స్‌కు థ్రిల్ క‌లుగుతుంది. సినిమా హిట్ చేసేస్తారు. అలా కొత్త కాన్సెప్ట్‌తో తాజాగా వ‌చ్చిన సినిమా ‘ఎస్‌ 99’. సి.జగన్ మోహన్ లీడ్ రోల్‌లో నటించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నేడు థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ‌దాం.

కథ:
రిటైర్డ్ ఎన్ఎస్ఏ అధికారి పాత్ర‌లో సి. జగన్ మోహన్(S99) న‌టించాడు. తాలుక్ దార్ పాషా ఓ క్రిమినల్. మంత్రికి సంబంధించిన విలువైన సమాచారం ఓ లేడీ జర్నలిస్ట్ వద్ద ఉందని తెలుసుకున్న మంత్రి తాలుక్ దార్ పాషాతో కిరాయి ఒప్పందం చేసుకుంటాడు. ఆ జర్నలిస్ట్ ను కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్ చేస్తాడు పాషా. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్ఏ రిటైర్డ్ అధికారి సి.జగన్ మోహన్ సహాయం కోరుతారు. లేడి జర్నలిస్ట్ ను కాపాడే లోపు.. ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు తాలుక్ దార్ పాషా. ఆమెను కాపాడే ప్రయత్నంలో కొంతమందిని చంపేస్తాడు S99. ఎవరు చంపారనే తెలుసుకునే క్రమంలో గతంలో చనిపోయిన S99 మళ్ళీ ఎలా బ‌తికొచ్చాడు ఆశ్చర్యపోతూనే.. గతంలోనూ, ప్రస్తుతమూ తన దారికి అడ్డువస్తున్న S99 ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు పాషా.. అసలు వీరి మధ్య ఉన్న పాత పగ ఏంటీ? ఆ అమ్మాయిని S99 కాపాడాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌:
లీడ్ రోల్ చేసిన సి జగన్మోహన్ సినిమాకు ఊపిరిపోశాడు. అత‌ని స్టైల్ కొత్త‌గా మెస్మ‌రైజ్ చేసేలా ఉంది. అప్ప‌ట్లో ర‌జ‌నీకాంత్ స్టైల్ గురించి చెప్పుకుంటే, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ స్టైల్ గురించి చెప్పుకునేలా క‌నిపించాడు. దర్శకుడిగా, నటుడిగా తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ కూడా స్టైలీస్టుగా చేశాడు. జ‌గ‌న్మోహ‌న్ రాసిన‌ కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక దయానంద్ రెడ్డి విల‌న్ పాత్రలో ఆకట్టుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మ అల్లరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. కిరికిరి రాజారెడ్డి పాత్రలో నటించిన దేవిప్రసాద్‌ కామెడీ సినిమాకు మరో హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, చక్రపాణి, కదిరి యోగి, రూపా లక్ష్మి, అల్లు రమేష్ త‌మ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
రెండు ప‌డ‌వ‌ల‌ను న‌డిపే కెప్టెన్‌గా సి.జగన్ మోహన్ S99 సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌లో కూర్చోబెట్టారు. ఒక వైపు ప్రధాన పాత్రలో నటిస్తూ, మరో వైపు దర్శకత్వం వహించి త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. తాను రాసుకున్న క‌థ‌ను అంతే ప‌ర్‌ఫెక్టుగా తెర‌పై చూపించాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఇక‌ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇదొక విజువల్‌ అండ్‌ సౌండ్‌ బేస్డ్‌ కాన్సెప్ట్‌ మూవీ. డిఫరెంట్‌ కలర్‌ టింట్‌తో తెరకెక్కించారు. జగన్మోహన్‌తో వింగ్ చున్ అంజి చేయించిన ఫైట్స్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాయి. విజయ్ కూరాకుల అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మ‌రింతా హెల్ప‌య్యాయి. సి. యతీష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతలు యతీష్, నందిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా క్వాలిటీగా నిర్మించారు.

టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఎస్‌ 99’ చిత్రం చాలా వినూత్న కథ, స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆడియ‌న్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు జగన్మోహన్ చేసిన ప్ర‌య‌త్నాన్ని, ప్ర‌యోగాన్ని అభినందించ‌వచ్చు. కొత్త క‌న్సెఫ్టు, క్రైమ్ థ్రిల్లర్‌లు ఇష్టపడే వారికి ఈ సినిమా ఇంకా బాగా న‌చ్చుతుంది.

రేటింగ్ : 3.5 / 5

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

BREAKINGNEWS TV

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

 

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *