హైదరాబాద్: లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి సినీ ప్రస్థానం వివరిస్తూ సావిత్రి క్లాసిక్స్ పేరుతో బుక్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎన్ కన్వేన్షన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. చిరంజీవి, సురేఖ దంపతులు సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
బ్రహ్మానందం, మురళీమోహన్, తనికెళ్ళ భరణి వంటి నటులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని రచయిత సంజయ్ కిషోర్ రాశారు.
ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి సావిత్రి నటనను కొనియాడారు. అలాగే ఆమెతో చిరంజీవికి ఉన్న అనుభవాలు, సాన్నిహిత్యం గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్ ’ పుస్తకాన్ని ఆవిష్క రిం చడం తో నా జన్మ సార్థకం అయిం దని భావిస్తున్నానని చెప్పారు. ”నా యాక్టింగ్ కోర్స్ ఇంకా పూర్తి కాలేదు. 1978లో నాకు పునాదిరాళ్ళు సినిమా ఆఫర్ వచ్చింది. నరసింహరాజు హీరో. మీతో పాటు మరొక ఇద్దరు కుర్రాళ్లు నటిస్తున్నారు అని నాతో చెప్పారు. షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళాము. అప్పుడు మీరు ఎవరితో నటిస్తున్నారో తెలుసా.. సావిత్రిగారితో అని చెప్పారు. ఆమె బస చేసిన హోటల్ కి తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు. ఆమెను చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.
నీ పేరు ఏమిటని ఆమె అడిగారు. ఒకటి రెండు రోజుల క్రితమే ప్రసాద్ నుండి నేను చిరంజీవిగా మారాను. చిరంజీవి అని చెప్పాను. శుభం అని ఆమె అన్నారు. పునాదిరాళ్లు సినిమా షూటింగ్ జరుగుతుండగా వేసవిలో వర్షం పడింది. ఇంటి వరండా గచ్చు వర్షపు జల్లుకు తడిసింది. సావిత్రి గారితో చిరంజీవి బాగా డాన్స్ చేస్తారు, చూడండి అని చెప్పారు. నా దగ్గర ఒక టేపు రికార్డర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఉండేవాడిని. టేపు రికార్డర్ ఆన్ చేసి పాటకు డాన్స్ వేస్తుంటే ఫ్లోర్ తడిసి ఉండటం వలన నా కాలు జారి కింద పడ్డాను.. పడినా కూడా ఆ పడిన మూమెంట్‌కు అనుగూనంగా డాన్స్ చేస్తూనే ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టారు. సావిత్రి గారు దగ్గరకు పిలిచి క్రింద పడినా కూడా డాన్స్ చేశావు. నీలో స్పోర్టివ్నెస్ నచ్చింది. భవిష్యత్ లో మంచి నటుడివి అవుతావు.. అన్నారు.
తర్వాత సావిత్రి గారితో ప్రేమ తరంగాలు అనే ఒక చిత్రం చేశాను. ఆ మూవీలో సావిత్రి కొడుకుగా నటించాను. తర్వాత ఆమెను నేను కలిసే అవకాశం రాలేదు. ఇంతలోనే సావిత్రి గారు కాలం చేశారు” అని చిరంజీవి వెల్లడించారు.
ఈ ఈవెంట్ లో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. చిరంజీవిని మొదటిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని అందరితో పంచుకున్నారు. విజయ చాముండేశ్వరి చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. చిరంజీవి కాలికి గాయం అయ్యి ఉందట. అయినాసరి ఆమె వచ్చిందని తెలుసుకున్న చిరంజీవి.. పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చారట. ఇక వచ్చిన తరువాత విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే ఆమెతో మాట్లాడుతూ.. “నేను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది” అని చెప్పారట.
మళ్ళీ ఆమె నమ్ముతారో లేదో అని సందేహం కలిగి.. పైకి వెళ్లి ఆ ఫోటోని తీసుకువచ్చి విజయ చాముండేశ్వరికి చూపించారట. చిరంజీవి విషయంలో తనకి నచ్చింది ఇదే అని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. కొందరు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసింది ఒకటి ఉంటుంది. కానీ చిరంజీవి విషయంలో.. ఆలోచన, మాట, ఆచరణ మూడు ఒకటే ఉంటాయని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. అందుకనే సావిత్రి క్లాసిక్స్ బుక్ ని చిరునే లాంచ్ చేయాలని భావించి.. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించినట్లు చెప్పుకొచ్చారు.
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP