విరాట‌ప‌ర్వం.. తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఓ మాస్ట‌ర్ పీస్. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంసల‌ వ‌ర్షం. సినిమా అయిపోయాక మ‌న‌సంతా భారంగా మారుతుంద‌ని, అంత‌లా ఈ సినిమా అంత‌లా త‌మ‌ని క‌దిలించింద‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా పోస్టులు ద‌ర్శ‌నమిస్తున్నాయి. విడుద‌ల‌తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, హ‌న్స్ ఇండియా, ఇండియాటుడే.. వంటి టాప్ ఇంగ్లీష్ మీడియా ఈ సినిమా ఏకంగా త్రి పాయింట్ ఫైవ్ స్టార్స్ ఇచ్చాయి. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్, ది న్యూస్ మినిట్, సాక్షి, వే టూ న్యూస్, ఫిల్మ్ బీట్‌.. వంటి టాప్ టెన్ మీడియా సైట్లు ఈ సినిమా త్రీ స్టార్స్ ఫైన్ రేటింగ్ ఇచ్చాయి. సినిమా సూప‌ర్ హిట్ ఎందుక‌యిందో స‌మిక్షించాయి.

నీది నాది ఒకే క‌థ‌తో నిరూపించుకున్న డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల విరాట‌ప‌ర్వంతో టాప్ డైరెక్ట‌ర్ల ప్లేస్‌లోకి చేరిపోయాడు. ఆయ‌న టేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పీపుల్స్ వార్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ కోసం ప‌రిత‌పించిన వెన్నెల పాత్ర అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు ఓటీటీ నుంచి భారీ డీల్ వ‌చ్చింది.

థియేటర్లలో విడుదల అవ్వని సినిమాలకే ఓటీటీలు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. అలాంటి థియేటర్లలో విడుదలయ్యి సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న తర్వాత అలాంటి సినిమాలను ఓటీటీలు అస్స‌లు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే థియేటర్లలో విడుదలవ్వగానే ఓటీటీలు రైట్స్ కోసం ఎగబడుతున్నాయి. తాజాగా విడుదలయిన విరాటపర్వంకు ప్రస్తుతం ఓటీటీల్లో భారీగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 17న విడుదలయిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. 15 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసిందని సమాచారం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాను 50 రోజులు తరువాత ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఒక్క ఓటీటీ డీల్‌తోనే సేఫ్ ప్లేస్‌లోకి వ‌చ్చేసింది. ఇక థియేట్రిక‌ల్స్ క‌లెక్ష‌న్‌లు అద‌న‌మే. సినిమా చాలాకాలం క్రితం మొదలయ్యి, ఎన్నో వాయిదాలు పడిన చిత్రం కావడంతో విరాటపర్వంపై అంచనాలు తగ్గిపోయాయి అనుకున్నారు విమర్శకులు. కానీ ప్రేక్ష‌కులు సినిమాపై సోష‌ల్ మీడియాలో రాస్తున్న రివ్యూల‌తో సినిమాపై హైప్ మ‌రింతా క్రియేట్ అయింది.


By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *