ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. వీడియో కాల్స్ కూడా చేసుకునే వీలుంది. అయితే మీరు వాట్సాప్ నుంచి ఏదైనా వాయిస్ కాల్స్ చేసినప్పుడు రికార్డు చేసే వెసులుబాటు లేదు. వాట్సాప్ చాట్ చేయడం, లైవ్ లొకేషన్‌లను పంపడం, ఫోటోలను మార్చుకోవచ్చు. మీరు వాట్సాప్ యూజర్ అయితే.. వాయిస్ కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్ లేదని తెలిసే ఉంటుంది. అయినా వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు రెండవ స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మీరు వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయొచ్చు. మీరు ఫోన్‌ను లౌడ్ స్పీకర్‌లో ఉంచాలి. మీ వాయిస్ రికార్డింగ్ ఎవరూ వినకూడదనుకుంటే, మీరు ప్రత్యేక గదిలో చేయవచ్చు. మీరు కాల్‌లను రికార్డ్ చేయడానికి ఏదైనా థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయనవసరం లేదు.

మ‌రో ప‌ద్ద‌తి చూస్తే.. మీ ప్రైవేట్ కాల్‌ని రికార్డ్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ స్టోర్‌లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన యాప్ ఎంచుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు రివ్యూలను చదవాలి. రేటింగ్‌ ఎంత ఇచ్చారు అనేది చెక్ చేయండి. అప్పుడు ఆ యాప్ మీకు ఉపయోగకరంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. WhatsApp కాల్‌లను రికార్డ్ చేయాలంటే ‘Call Recorder Cube ACR’ యాప్ ఉపయోగించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇన్‌కమింగ్ అవుట్‌గోయింగ్ వాట్సాప్ కాల్‌లన్నింటినీ ఆటోమాటిక్‌గా రికార్డ్ చేయగలదు. ఈ యాప్‌లో టెలిగ్రామ్, స్లాక్, Zoom, Facebook, సిగ్నల్ వంటి ఇతర యాప్‌ల కాల్‌లను కూడా రికార్డ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

కాల్ రికార్డింగ్‌ని సెటప్ చేసే ప్రక్రియ చాలా సులభం.. మీరు కేవలం ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అయితే సరిపోతుంది. ‘Call Recorder Cube ACR’ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి.యాప్ ఒకసారి డౌన్ లోడ్ చేశాక.. Accessibility > Settings Cube ACR app connector ఎనేబల్ చేయాలి. మీరు బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్‌ను Disable ఎంచుకోవచ్చు. యాప్ మీ WhatsApp కాల్‌లను రికార్డ్ చేయాలనుకుంటే WhatsAppని ఎంచుకోండి. మీరు ఎప్పుడైనా ఆటో-రికార్డింగ్‌ని Stop చేయొచ్చు.. కాల్‌లను మాన్యువల్‌గా రికార్డింగ్ చేయొచ్చు. మీరు Hamburger > రికార్డింగ్ > ఆటోస్టార్ట్ రికార్డింగ్‌ని డిసేబుల్ చేయొచ్చు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *