బాలీవుడ్ విశ్వసనీయ మీడియా సంస్థల్లో ఒకటిగా పేరున్న ఓర్మాక్స్ మీడియా.. 2010 నుండి ప్రతీ నెల సోషల్ మీడియాలో వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. లేటెస్టుగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్-ఇండియా వైడ్ అత్యంత ప్రజాదరణ పొందిన మేల్ & ఫీమేల్ స్టార్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఓర్మాక్స్ మీడియా విడుద‌ల చేసిన ఈ జాబితాలో తమిళ హీరో విజయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టులో రెండో స్థానాన్ని సంపాదించాడు. ఇందులో 3వ స్థానంలో ప్రభాస్, 4వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ జాబితాలో 8వ ప్లేస్ లో రామ్ చరణ్.. 10వ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. ఈ లిస్టులో 9మంది సౌత్ స్టార్స్ ఉండగా.. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడే ఉన్నారు. ‘RRR’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకున్న తారక్.. ‘కొమురం భీముడో’ పాటలో అద్భుతమైన నటనతో అందరి హృదయాలను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చుట్టూ ఏర్పడిన బజ్ కారణంగా పాన్ ఇండియా వైడ్ మోస్ట్ పాపులర్ స్టార్ గా అవతరించాడు.

నిజానికి RRR విడుదల తర్వాత ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే ఇవేవీ తారక్ స్టార్ డమ్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని ఓర్మాక్స్ మీడియా నివేదికలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్స్ జాబితాలో జూనియర్ టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ మీడియా సంస్థ పాన్-ఇండియా సూపర్ స్టార్ల జాబితాలో ప్రభాస్ – మహేష్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్, ఇతర బాలీవుడ్ స్టార్స్ కంటే ఎన్టీఆర్ కు అగ్రస్థానాన్ని అందించిందంటే.. నందమూరి హీరో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని అర్థం చేసుకోవచ్చు. RRR మూవీ ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ నార్త్ లో మరింత పెరిగిందని అనుకోవాలి. తారక్ ఇప్పుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి ఇద్దరు పాపులర్ దర్శకులతో వరుసగా రెండు పాన్-ఇండియా ప్రాజెక్ట్లు లైన్ లో పెట్టాడు. NTR30 – NTR31 సినిమాలు స్టార్ హీరోకి ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.

ఇకపోతే ఇండియా వైడ్ మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ లో అలియా భట్ – 3వ స్థానంలో నయనతార ఉన్నారు. 4 వ‌స్థానంలో కాజల్ అగర్వాల్, 5వ స్థానంలో దీపికా పదుకొనె, 6వ స్థానంలో రష్మిక మందన్నా, 7వ స్థానంలో అనుష్క శెట్టి, 8వ స్థానంలో కత్రినా కైఫ్, 9వ స్థాన‌లంలో కీర్తి సురేష్, 10వ స్థానంలో పూజా హెగ్డే నిలిచారు. మొత్తానికి మోస్ట్ పాపులర్ స్టార్స్‌గా ఇటు తార‌క్, స‌మంతా టాప్ ప్లేస్‌లో నిల‌వ‌డంతో నేష‌న‌ల్ వైడ్‌గా మ‌న‌ వారికి అరుదైన ఘ‌న‌త ల‌భించిన‌ట్ట‌యింది.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *