కాలేజీ స్టూడెంట్స్ తీరు ఒక్కోసారి వెగ‌టు పుట్టిస్తున్నాయి. అంతేకాకుండా వాటిని వీడియో తీసి Social Mediaలో షేర్ చేస్తుంటారు. ఇలాంటిదే.. ఇటీవల కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ Lip-Lock Challenge వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు పాల్పడిన విద్యార్థులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మంగళూరులోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఓ ప్రైవేటు అపార్టుమెంటులో Get-Together ఏర్పాటు చేసుకున్నా రు. ఆ సందర్భంగా Truth or Dare పోటీలో భాగంగా Lip-Lock Challenge నిర్వహించారు. ఇందులో భాగంగా యూనిఫాంలో ఉన్న ఒక విద్యార్థి మరో విద్యార్థినితో ముద్దు పెడుతుండగా.. తోటి విద్యార్థులు కేరింతలు కొడుతూ వీడియో తీశారు. అనంతరం ఆ టీమ్‌లోని ఓ 17ఏళ్ల స్టూడెంట్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ వీడియోను ఇటీవల పోస్టు చేయడంతో బాధిత అమ్మా యి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వీడియోను చూపించి ఆ టీమ్‌లోని ఇద్దరు విద్యార్థినులపై వివిధ సందర్భాల్లో తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లూ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ, ఐటీ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు అనంతరం వారిని జువనైల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. విద్యార్థుల కార్యకలాపాలపై కాలేజీ యాజమాన్యాలు నిఘా వేసి ఉంచాలని పోలీస్ కమిషనర్ అదేశించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటే వెంట‌నే త‌మ‌కు కంప్లైంట్ ఇవ్వాల‌ని కోరారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *