ఎన్నారైల‌కు అల‌ర్ట్ ఇదుగో..

ప్రపంచం సాంకేతికంగా అభివృద్ది చెందుతోంది. ప్రతీ రంగంలో టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియాను కాదని సోషల్ మీడియా దూసుకుపోతోంది. న్యూస్ కవరేజ్ కంటే ముందుగానే సోషల్ మీడియాలో వార్తలు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. దీంతో న్యూస్ ఛానెళ్లు సైతం సోషల్ మీడియాను ఫాలో అవుతున్నాయి. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంది. కానీ అంతేస్థాయిలో అది రియల్ న్యూసా..? ఫేక్ న్యూసా..? అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొందరు ఫేక్ న్యూస్ లు తయారు చేసిన పోస్టులు పెడుతున్నారు. వాటికి చాలా మంది యువకులు రియాక్టయి షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేసిన వారు కటకటాల పాలవుతున్నారు. ముఖ్యంగా UAEలో నివసించే భారత సంతతికి చెందిన వారు ఇలా కొన్ని పోస్టులు షేర్ చేసి జైలుపాలయిన వారున్నారు. ఈ క్రమంలో అసలు UAEలో ఉండే చట్టాలెంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

భారత్ నుంచి వివిధ కారణాలతో UAE వెళ్లినవారెందరో ఉన్నారు. విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో రాణిస్తూ భారత్ పేరు నిలబెడుతున్నారు. అయితే కొందరు తమ పనుల్లో నిమగ్నమై అక్కడి చట్టాల గురించి తెలుసుకోలేకపోతున్నారు. UAE చట్టాలు కఠినంగా ఉంటాయి. సున్నిత విషయంలో అక్కడి ప్రభుత్వం పకడ్బందీగా ఉంటుంది. ఈ క్రమంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ కామెంట్ చేసినా కఠినంగా శిక్షిస్తుంది. అసలు యూఏఈ చట్టాలు ఎలా ఉంటాయి..? సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి..?

UAEలో మతానికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటున పోస్టు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడుతారు. మతాలను కించపరుస్తూ పోస్టులు పెడితే ఆర్టికల్ 32 34 ప్రకారం నేరం. దీనికి శిక్షగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2 కోట్ల 50 లక్షల రూపాయలు. శిక్షను బ‌ట్టి ఒక మిలియన్ దిర్హమ్ ల వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. ఇక దేశాల అంతర్గత విషయాలు రాజకీయాల గురించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. ఈ నేరానికి పాల్పడ్డ వారు కనీసం ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది. అలాగే కోటి 50 లక్షల దిర్హాముల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. UAE మతానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అక్కడి సంస్కృతికి అంతే విలువ ఇస్తుంది. తమ దేశ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా కామెంట్ చేసినా.. అలాంటి పనులు చేసినా నేరం కిందనే భావిస్తారు. అయితే చాలా మంది ప్రవాస భారతీయులు ఇవేమీ తెలియకుండా తప్పులు చేస్తున్నారు. అలా తప్పులు చేసి జైలు శిక్షను అనుభవిస్తున్నవారూ ఉన్నారు. అందువల్ల ముందుగా అక్కడి చట్టాలను తెలుసుకోండి.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి వ్యతిరేక పోస్టులు పెట్టకుండా ఉండండి..

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *