ఫైమా.. ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలో ఓ సంచ‌ల‌నం. గతంలో పటాస్, పోవేపోరా షోలలో కనిపించింది. జబర్దస్త్‌తో మ‌రింతా పాపులారిటీ అందుకుంది. చూస్తేనేస్తేమో బక్కపలుచగా.. కాస్త డార్క్ షేడ్.. పెద్దగా ఆకట్టుకునే పర్సనాలిటీ కాదు.. కానీ ఇదే ఆమెను నిలబెట్టిందేమో.. తోటి కమెడియన్లు, స్క్రిప్టు రైటర్లు ఆమె ఫిజికల్ అప్పియరెన్స్ మీద జోకులు వేశారు. వెకిలి కామెంట్లు.. బాడీ షేమింగ్.. అయితేనేం, ఆమె వాటినే తన బలాలుగా మార్చుకుంది. ఆమెలోని ఎనర్జీ, కామెడీ టైమింగు చూస్తే ముచ్చటేస్తుంది. అవసరమైతే మరింత నలుపును పులుముకుని మరీ స్కిట్స్ చేస్తుంది. కొందరు సీనియర్ కమెడియన్లు కూడా ఆమె టైమింగ్ ముందు వెలవెలబోతున్నారు.

జబర్దస్త్ కామెడీ షోలో టైమింగ్ తో కామెడీ చేస్తూ.. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది ఈ లేడీ కమెడియన్ ఫైమా. ఫైమా తెరపై కనిపిస్తే చాలు నవ్వు పంట పండుతుంది. వరుసగా ప్రవాహంలా ఫైమా వేసే పంచులకు కడుపు పట్టుకుని నవ్వాల్సిందే.. అటువంటి నవ్వుల రేడు ఫైమా వెనకు కష్టాల కడగళ్ళు కూడా ఉన్నాయి. పటాస్ షో తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది ఫైమా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో తో ఆడియన్స్ కు ఎంతో దగ్గర అయ్యింది. జబర్దస్త్ లోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయెల్ చేసే కామెడీ స్కిట్ లో ఫైమ్ తన మార్క్ కామెడీ పంచులతో.. కడుబుబ్బా నవ్విస్తుంది ఫైమా. చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ లో మంచి పాపులారిటీ పొందిన లేడీ కమెడియన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె అసలు ప్రయాణం వెనక వేరే లక్ష్యం ఉందట. పైమా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, జబర్దస్త్ షో ద్వారా తన ప్రయాణం ఎలా మొదలయింది అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో వివరంగా తెలిపింది. తను ఇంతలా నవ్విస్తున్నా.. గతంలో ఎంతగా బాధలు పడింది.. ఎన్ని కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చిందో ప్లాష్‌బ్యాక్ రివీల్ చేసింది ఫైమా.

తమ తల్లి బీడీలు చుట్టి తమను పెంచిందని, అమ్మకు వచ్చిన ఆ కొంచం డబ్బుతోనే తమకు ఏం కావాల్సిన కొని ఇచ్చేది అని చెప్పుకొచ్చింది. తన బిడ్డలు మంచి పేరు సంపాదించాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది అని చెప్పింది. తాము నలుగురు అక్కాచెల్లెళ్లమ‌ని, ముగ్గురికి చిన్నవయసులోనే పెళ్లిళ్లు కూడా అయిపోయాయి అని తెలిపింది ఫైమా. అమ్మ ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుని మెలగాలని చెబుతూ ఉండేద‌ని, అప్పుడు ఆమె మాటలు త‌న‌కు అర్థమయ్యేవి కాద‌ని, తర్వాత మల్లెమాలలో అవ‌కాశం వ‌చ్చిన త‌ర్వాత‌.. అప్పుడప్పుడు మాటల్లో ఆంతర్యం ఏమిటో త‌న‌కు అర్థం అయ్యింద‌ని చెప్పుకొచ్చింది. అమ్మ కల నెరవేరింది అని తెలిపింది. జబర్దస్త్ లో రాకముందు త‌ను చదువులో కూడా వెనకబడి ఉండేదాన్న‌ని, అప్పటిలో టైలరింగ్ చేస్తూ.. సాధారణ జీవన సాగించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. త‌న‌ అదృష్టం కొద్ది జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. త‌న‌కు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేద‌ని.. మా చిన్న వయసులో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళమ‌ని.. ఇంటి వాళ్ళు వెళ్లిపోమంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వ‌చ్చింద‌ని, సరైన సదుపాయాలు కూడా ఉండేవి కాద‌ని, అలానే సర్దుకు పోయేవాళ్ళమ‌ని పాత జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంది. అమ్మ పడుతున్న కష్టాలు చూసేవాళ్ళం కాబట్టి అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలని నలుగురు అక్కచెల్లెళ్లం అనుకునేవాళ్ళమ‌ని.. ఇప్పుడు త‌న ల‌క్ష్యం.. అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వడం నెర‌వేరింద‌ని ఫైమా తెలిపింది. సీన్ క‌ట్ చేస్తే… బుల్లితెర మీద ప్రవీణ్‌తో క‌లిసి ఫైమా చేసే షోలు పాపుల‌ర్ అయ్యాయి. ప్రవీణ్‌తో ఫైమా ప్రేమ‌లో ఉంద‌నే టాక్ కూడా ఉంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ పటాస్ షో నుంచి స్టార్ట్ అయ్యిందని, ఆ త‌ర్వాత ఇద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారిందంటారు. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రవీణ్ ఫైమా మీద తన ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఫైమా మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ప్రవీణ్ ఐ లవ్ యూ అనే మాత్రం చెప్పలేదు. ప్రవీణ్ అంటే ఇష్టం ఉందో లేదో కూడా ఎప్పుడూ ఆడియన్స్ ముందు మాత్రం ఫైమా ఓపెన్ కాలేదు. ఐతే ఇటీవ‌ల క్యాష్ షోలో యాంక‌ర్ సుమ ప్రవీణ్, ఫైమా జంటకు లై డిటెక్టర్ పరీక్షలు పెట్టింది. నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు కావాలా? ప్రవీణ్ కావాలా? అని ఫైమని అడుగుతుంది సుమ. “నాకు అవార్డు వద్దు, ప్రవీణ్ కావాలి” అంటుంది ఫైమా. ఫైమా ఆన్సర్ రాంగ్ అన్నట్టుగా ఆ లై డిటెక్టర్ మూడుసార్లు కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉంటుంది. నువ్ ఎన్నిసార్లయినా అరుచుకో నాకు ప్రవీణే కావాలి అంటుంది ఫైమా. అలా క్యాష్ లో ప్రవీణ్ మీద ఉన్న తన ప్రేమను ఇన్నాళ్లకు ఈ షో ద్వారా బయటపెట్టింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. ఇక ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకున్న ఫహీమా ప్రస్తుతం వారానికి 50 వేల‌ రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఫైమా జబర్దస్త్ షోతో పాటు మరో మూడు షోలు చేస్తుంది. ఏదీ ఏమైనా ఫైమా త‌న టాలెంట్‌తో కెరీర్‌లో నెక్ట్స్ లెవ‌ల్‌ను నిర్మించుకుంటోంది.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *