▪️ హైదరాబాద్‌లో ల్యాబ్ డెవలప్డ్ డైమండ్స్
▪️ స్థాపించిన మిసెస్ ఇండియా సుష్మా తోడేటి
▪️ అందంగా, ఆకర్షణీయంగా వజ్రాభరణాలు
▪️ ఘనంగా వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమం
- హైదరాబాద్ (కొత్తగూడ):
వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ ధగధగలు.. ఆచంద్రతారార్కం.. కాబట్టే, వజ్రానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మిసెస్ ఇండియా సుష్మా తోడేటి ల్యాబ్‌లో అందంగా, అలంకరంగా పొదిగిన నాణ్యమైన వజ్రాభరణాలు అందించేందుకు ‘హౌస్ ఆఫ్ హీరే’ సంస్థను స్థాపించారు. తాజాగా హైదరాబాద్‌లోని కొత్తగూడలో ‘హీరే’ అధికార వెబ్‌సైట్ (www.houseofheere.com)ను రిటైర్డ్ ఎస్పీ వెంకట్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రచయిత్రి తాటికొండ కళావతి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేడుకకు ముఖ్య పాత్ర పోషించారు.
సరికొత్త ఆవిష్కరణలతో విలాసవంతమైన వజ్రాభరణాలను అందించేందుకు ‘హీరే’ను స్థాపించామని ఈ సందర్భంగా సుష్మా తోడేటి చెప్పారు. ప్రత్యేక ల్యాబ్ రూపొందించిన వజ్రాలతో ప్రత్యేకత కలిగిన ప్రముఖ బ్రాండ్‌గా ‘హౌస్ ఆఫ్ హీరే’ కొనసాగుతుందన్నారు. చక్కటి ఆభరణాల తయారీలో సున్నితమైన పార్టులను కూడా రూపొందించడం తమ నైపుణ్యతను తెలియజేస్తుందని చెప్పారు. అందంగా పొదిగిన వజ్రాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయని, అందంగా, ఆకర్షణీయంగా రూపొందించి అందిస్తామన్నారు.
తాజాగా వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా అన్ని రకాల ఆభరణాలపై 20 శాతం తగ్గింపు ఇస్తున్నామని ఈ సందర్భంగా సుష్మా తోడేటి తెలిపారు. జీవితాంతం నిలిచి ఉండే అత్యుత్తమ ల్యాబ్ వజ్రాభరణాల కలెక్షన్‌లు తమ వద్ద మాత్రమే దొరుకుతాయని, నైపుణ్యత కలిగిన కళాకారులతో అత్యంత జాగ్రత్తగా నిర్మించిబడిన అందమైన, ప్రకాశవంతమైన ఆభరణాలను చూడగానే ప్రతి ఒక్కరూ మైమరిచిపోతారని ఆమె చెప్పారు.
***